AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత్యక్రియలకు కేంద్రం మార్గదర్శకాలు..తప్పనిసరి

కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. మృతదేహాం తరలింపు సమయంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఇన్‌ఫెక్షన్...

అంత్యక్రియలకు కేంద్రం మార్గదర్శకాలు..తప్పనిసరి
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2020 | 12:42 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను ‘విపత్తు’గా ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌తో చనిపోయేవారి అంత్యక్రియలు ఎలా జరపాలి..? మ‌ృతదేహాలకూ వాటి నుంచి వెలువడే ప్రత్యేక ద్రవాల్లోనూ కరోనా ఉంటుంది. అలాంటప్పుడు కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. మృతదేహాం తరలింపు సమయంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిర్దేశించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అంత్యక్రియలకు కేంద్రం మార్గదర్శకాలు ఇవే: * కరోనా సోకిన వ్యక్తి ఏకాంత గదిలో మరణించినప్పుడు డెడ్‌బాడీని పరిశీలించేప్పుడు తడి అంటని యాప్రాన్‌, గ్లోవ్స్‌, మాస్క్‌లు ఉపయోగించాలి. * ఏకాంత గది నుంచి మృతదేహాన్ని తొలగించేటప్పుడు కుటుంబసభ్యులు ఎవరైనా చూడాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. * మృతదేహాన్ని తరలించేప్పుడు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరచుగా 1% హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలని కోరింది. * వ్యక్తి మరణించిన ఏకాంత గదిలో నేల, మంచం, రెయిలింగ్స్‌, పక్క టేబుళ్లు, స్టాండ్లన్నింటినీ 1% సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరచాలి. * మృతదేహానికి ట్యూబులు, డ్రైన్లు వంటివి ఉంటే తప్పని సరిగా తొలగించాలి. * మృతదేహం నుంచి ద్రవాలేవీ బయటకు రాకుండా నోరు, నాసికారంధ్రాలు సరిగా మూసిపెట్టాలి. * మృతదేహాన్ని లీక్‌-ప్రూఫ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచాలి. ఆ బ్యాగును 1% హైపోక్లోరైట్‌తో శుభ్రపరచాలి. * మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంకానీ, మార్చురీకి తరలించడంకానీ చేయాలి. * రోగికోసం వాడిన వస్త్రాలన్నింటినీ బయోహజార్డ్‌ బ్యాగ్‌లో ఉంచాలి. * మృతదేహాన్ని తరలించే సిబ్బంది సర్జికల్‌ మాస్క్‌, గ్లోవ్స్‌తోపాటు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలి. * మృతదేహాన్ని తరలించిన వాహనాన్నికూడా 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. * సాధ్యమైనంత వరకూ శవపరీక్ష లేకుండా చూడాలి. తప్పనిసరైతే డాక్టర్లు తగుజాగ్రత్తలు పాటించాలి. * మృతదేహాలను 4 డిగ్రీల సెల్సియస్‌ కోల్డ్‌ ఛాంబర్స్‌లో ఉంచాలి. * శవాగారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. * అటాప్సీ గదిలోకి పరిమిత సంఖ్యలోనే ఫోరెన్సిక్‌ నిపుణులు, సహాయక సిబ్బందిని అనుమతివ్వాలి. సిబ్బంది ఎన్‌95 మాస్క్‌లు, కళ్లద్దాలు వాడాలి. * మొనతేలని కత్తెరలు (రౌండ్‌ ఎండెడ్‌) మాత్రమే ఉపయోగించాలి.మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని పూర్తిగా 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రంచేసి బ్యాగ్‌లో పెట్టాలి. * ఏకాంత గదులు, మార్చురీ, అంబులెన్స్‌, శ్మశానవాటికల్లో మృతదేహాలను ఎత్తి, దించే కార్మికులందరికీ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా శిక్షణ ఇవ్వాలి. * మృతదేహానికి ఎంబామింగ్‌ చేయడానికి అనుమతివ్వకూడదు.