AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార‌త్ తో ఒకేరోజు 16 కోవిడ్ మ‌ర‌ణాలు..ప్ర‌మాద‌కరంగా ప‌రిస్థితులు

కరోనా వైరస్​ భారత్​లో రోజురోజుకు ప్ర‌మాద‌కరంగా మారుతోంది. కరోనా మహమ్మారి ధాటికి శుక్రవారం ఒక్క‌రోజే 16 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఈ ప్ర‌మాద‌క‌ర అంటువ్యాధి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి ఒక్క రోజులో ఇవే అత్యధిక మ‌రణాలు. దీంతో కోవిడ్ వ‌ల్ల భార‌త్ లో ఇప్ప‌టివ‌రకు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య 85కు చేరుకుంది. రాష్ట్రాల నుంచి వ‌రుస‌గా గ‌త‌ రెండో రోజులుగా 500ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 […]

Ram Naramaneni
|

Updated on: Apr 04, 2020 | 7:24 AM

Share

కరోనా వైరస్​ భారత్​లో రోజురోజుకు ప్ర‌మాద‌కరంగా మారుతోంది. కరోనా మహమ్మారి ధాటికి శుక్రవారం ఒక్క‌రోజే 16 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఈ ప్ర‌మాద‌క‌ర అంటువ్యాధి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి ఒక్క రోజులో ఇవే అత్యధిక మ‌రణాలు. దీంతో కోవిడ్ వ‌ల్ల భార‌త్ లో ఇప్ప‌టివ‌రకు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య 85కు చేరుకుంది. రాష్ట్రాల నుంచి వ‌రుస‌గా గ‌త‌ రెండో రోజులుగా 500ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేల మార్కును దాటి 3,082కు చేరింది. గురువారం అత్య‌ధికంగా 544 కేసులు న‌మోద‌వ‌గా, శుక్రవారం 502 మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింది.

హెత్త్ మినిస్ట్రీ చెబుతోన్న లెక్క‌ల ప్ర‌కారం..గ‌త రెండు రోజుల్లో నమోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల్లో 647 మంది జ‌మాత్ మీటింగ్ తో సంబంధం ఉన్న‌వారిగా నిర్ధార‌ణ అయ్యింది. కాగా శుక్ర‌వారం ఒక్క‌రోజే త‌మిళ‌నాడులో 102 పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అందులో 100 మంది నిజాముద్దీన్ తో లింక్ ఉన్న‌వారే ఉన్నారంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో మొత్తం 80 కేసుల్లో(గురువారం రాత్రి న‌మోదైన 5 కేసులు క‌లుపుకుని) 78.. యూపీలో న‌మోదైన 48 కేసుల్లో42..నిజాముద్దీన్ తో సంబంధం ఉన్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం.