AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు, నాగ్ ల‌కు థ్యాంక్స్..తెలుగులో ప్ర‌ధాని ట్వీట్..

కరోనా మహమ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. మ‌నదేశంలో కూడా ఈ వైర‌స్ ఇప్పుడిప్పుడే ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ప్ర‌ధాని ముందు జాగ్రత్త చర్యగా 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పిల‌పునివ్వ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్లకే ప‌రిమిత‌మై, సామాజిక దూరం పాటించి వ్యాధి వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. అయితే కొంద‌రు మాత్రం క‌రోనాను లైట్ తీసుకుంటున్నారు. విచ్చ‌ల‌విడిగా రోడ్డుపైకి వ‌చ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రిటిస్ వారికి సోష‌ల్ మీడియా ద్వారా అవ‌గాహ‌న క‌లిపిస్తున్నారు. […]

చిరు, నాగ్ ల‌కు థ్యాంక్స్..తెలుగులో ప్ర‌ధాని ట్వీట్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 8:38 AM

Share

కరోనా మహమ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. మ‌నదేశంలో కూడా ఈ వైర‌స్ ఇప్పుడిప్పుడే ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ప్ర‌ధాని ముందు జాగ్రత్త చర్యగా 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పిల‌పునివ్వ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్లకే ప‌రిమిత‌మై, సామాజిక దూరం పాటించి వ్యాధి వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు.

అయితే కొంద‌రు మాత్రం క‌రోనాను లైట్ తీసుకుంటున్నారు. విచ్చ‌ల‌విడిగా రోడ్డుపైకి వ‌చ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రిటిస్ వారికి సోష‌ల్ మీడియా ద్వారా అవ‌గాహ‌న క‌లిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో పాట‌ల రూపంలో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో చెప్ప‌డానికి అగ్ర‌క‌థానాయ‌కులు మంచి ప్ర‌యత్నాలు చేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి సార‌థ్యంలో చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సంయుక్తంగా చేసిన పాట జ‌నంలోకి బాగా వెళ్లింది. ఈ సాంగ్ వీడియోను డీడీ న్యూస్ ఏప్రిల్ 2న ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను శుక్ర‌వారం చూసిన ప్రధాన మంత్రి వెంటనే స్పందించారు. తెలుగు భాషలో ట్వీట్ చేశారు.

‘‘చిరంజీవిగారికి, నాగార్జునగారికి, వరుణ్ తేజ్‌కి, సాయి ధరమ్ తేజ్‌కి మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం’’ అని తన ట్వీట్‌లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.