AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనాతో గ్రామీణ మ‌హిళ మృతి, సంద‌ర్శించిన సీపీ స‌జ్జ‌నార్‌..

హైద‌రాబాద్ న‌గ‌ర శివారు రంగారెడ్డి జిల్లాలో అనారోగ్యంతో మంచంప‌ట్టిన మ‌హిళ‌ను ఉస్మానియాలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇటీవ‌లే ఆమె మ‌ర‌ణించింది. ఆమెకు అంత్య‌క్రియ‌లు కూడా జ‌రిగిపోయాయి. అయితే, ..

క‌రోనాతో గ్రామీణ మ‌హిళ మృతి, సంద‌ర్శించిన సీపీ స‌జ్జ‌నార్‌..
CP Sajjanar Review Ovar QNET Scam
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2020 | 7:07 AM

Share
హైద‌రాబాద్ న‌గ‌ర శివారు రంగారెడ్డి జిల్లాలో అనారోగ్యంతో మంచంప‌ట్టిన మ‌హిళ‌ను ఉస్మానియాలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇటీవ‌లే ఆమె మ‌ర‌ణించింది.  ఆమెకు అంత్య‌క్రియ‌లు కూడా జ‌రిగిపోయాయి. అయితే, ఆ త‌ర్వాత మృతురాలికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ వ‌చ్చాయి. అందులో ఆమెకు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లుగా తేలింది. దీంతో మృతురాలి స్వ‌గ్రామం చేగూర్ తో పాటు బంధువులు, చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోనూ అల‌జ‌డి రేగింది. కరోనాతో మృతి చెందిందని తెలుసుకున్న గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే…
రంగారెడ్డి జిల్లా నందిగామ మండ‌లంలోని కోడూరు గ్రామానికి చెందిన మాణిక్య‌మ్మ అలియాస్ భార‌త‌మ్మ అనే మ‌హిళ కిరాణం షాప్ న‌డుపుతుండేది. ఈ నెల 31న అనారోగ్య రీత్యా ఉస్మానియాలో చేరడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో అప్రమతమైన అధికారులు శాంతి వనాన్నీ, చేగుర్ గ్రామాన్ని హుటాహుటిన పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు.
మృతురాలు భారతమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న సుమారు 9 మందిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని హోమ్ క్వారన్ టైన్ కు పంపించారు. వీరిలో కొందరు ఇటీవల సంపర్క్ క్రాంతి రైలులో బిహార్ నుంచి శాంతి వనంలో పని కోసం వచ్చారని సమాచారం. వీరు చేగూర్ గ్రామంలోని మృతి చెందిన భారతమ్మ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఆమె మృతి చెందడం వల్ల వైరస్ ఎవరెవరికి సోకిందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..