Coronavirus: దండకారణ్యంలో కరోనా టెర్రర్‌.. మావోయిస్టులను వదలని కరోనా మహమ్మారి.. పోలీసుల బంపర్‌ ఆఫర్‌

Coronavirus: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని బలి తీసుకుంటుండగా, తాజాగా దండకారణ్యంలో కరోనా హడలెత్తిస్తోంది..

Coronavirus: దండకారణ్యంలో కరోనా టెర్రర్‌.. మావోయిస్టులను వదలని కరోనా మహమ్మారి.. పోలీసుల బంపర్‌ ఆఫర్‌
Follow us

|

Updated on: May 10, 2021 | 6:16 AM

Coronavirus: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని బలి తీసుకుంటుండగా, తాజాగా దండకారణ్యంలో కరోనా హడలెత్తిస్తోంది. మావోయిస్టులపై కరోనా పంజా విసురుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సుమారు 100 మంది వరకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు గట్టి నిఘా పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎప్పటికప్పుడు వారి ఆచూకీ కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు. అయితే కరోనా సోకిన వాళ్లలో మహిళా మావోయిస్టు నేత సుజాతతో పాటు జయలాల్‌, దినేష్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా సోకిన మావోయిస్టులకు ఉచితంగా వైద్య అందిస్తామని పోలీసులు వెల్లడించారు. సుజాతపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం. కరోనా సోకిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీలు పిలుపునిచ్చారు. అయితే కొరియర్లతో మావోయిస్టులకు కరోనా సోకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైదానం ప్రాంతాలకు వచ్చిన మావోయిస్టు నేతలతో దళాల్లో కరోనా పాకినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ మావోయిస్టులకు దడ పుట్టిస్తోంది. కాగా, మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేతలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన దాడిలో 20 మందికిపైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్న మావోయిస్టులు.. తరచూ బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతినిత్యం వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు. ఆ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జరిగే వంతెన, చెక్‌ డ్యామ్‌, రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు. అంతేకాదు వాహనాలను సైతం తగులబెడుతున్నారు. అలాగే ఇటీవల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కనిపించని మావోయిస్టులు.. ఇటీవల నుంచి వారి కదలికలు ఎక్కువైపోవడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. వారిపై ప్రత్యేక నిఘా పెంచి అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Lockdown: కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌.. నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌.. అనుమతి ఉన్నవి.. అనుమతి లేనివి..!

COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?