జేకేఎల్‌ఎఫ్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

జేకేఎల్‌ఎఫ్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ:  జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకెఎల్‌ఎఫ్) మీద ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్‌ఎఫ్‌ ప్రమేయం ఉండటంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడించారు. ఈ సంస్థకు యాసిన్‌ మాలిక్ నాయకత్వం వహిస్తున్నాడు. యాసిన్‌ మాలిక్‌ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్‌ 1988 నుంచి కశ్మీర్‌లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోందని చెప్పారు.  అన్‌లాఫుల్ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్ యాక్ట్‌లోని వివిధ ప్రొవిజన్ల కింద దానిపై నిషేధం […]

Ram Naramaneni

|

Mar 22, 2019 | 9:12 PM

దిల్లీ:  జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకెఎల్‌ఎఫ్) మీద ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్‌ఎఫ్‌ ప్రమేయం ఉండటంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడించారు. ఈ సంస్థకు యాసిన్‌ మాలిక్ నాయకత్వం వహిస్తున్నాడు. యాసిన్‌ మాలిక్‌ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్‌ 1988 నుంచి కశ్మీర్‌లో వేర్పాటువాద సిద్ధాంతాన్ని వ్యాపింపచేస్తోందని చెప్పారు.  అన్‌లాఫుల్ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్ యాక్ట్‌లోని వివిధ ప్రొవిజన్ల కింద దానిపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.  ప్రస్తుతం జేకెఎల్‌ఎఫ్ అధినేతను అరెస్ట్‌ చేసి, జమ్ములోని కోట్ బల్వాల్ జైల్లో ఉంచారు. ఒకే నెలలో నిషేధానికి గురైన రెండో కశ్మీరీ సంస్థ ఇది. కొద్ది రోజుల క్రితం జామత్-ఇ-ఇస్లామీ జమ్ముకశ్మీర్‌ అనే సంస్థను కేంద్రం నిషేధించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu