ఆ కోపిష్టి ఏనుగుకు గ్రీన్‌సిగ్నల్.. ఖుషీలో కేరళవాసులు
మొత్తానికి కేరళవాసుల్లో కొత్త ఉత్సాహం వచ్చేసింది. తమ అభిమాన గజరాజుకు డాక్టర్లు, కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. రామచంద్రన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రతి ఏటా త్రిశూర్‌లో అట్టహాసంగా జరిగే పూరం వేడుకల్లో రామచంద్రన్ అనే ఓ ఏనుగు కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఉత్సవాల ప్రారంభ సూచికగా వడక్కుమ్‌నాథన్ ఆలయం దక్షిణం వైపున్న ద్వారాల్ని ఈ ఏనుగు […]

మొత్తానికి కేరళవాసుల్లో కొత్త ఉత్సాహం వచ్చేసింది. తమ అభిమాన గజరాజుకు డాక్టర్లు, కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. రామచంద్రన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతి ఏటా త్రిశూర్‌లో అట్టహాసంగా జరిగే పూరం వేడుకల్లో రామచంద్రన్ అనే ఓ ఏనుగు కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఉత్సవాల ప్రారంభ సూచికగా వడక్కుమ్‌నాథన్ ఆలయం దక్షిణం వైపున్న ద్వారాల్ని ఈ ఏనుగు చేతనే తెరిపిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ గృహప్రవేశంలో ఈ ఏనుగు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. దీంతో ఈ గజరాజుపై వేటేశారు. ఇకపై ఆధ్యాత్మిక ఉత్సవాల్లో రామచంద్రన్ పాల్గొనకూడదంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అయితే ఈ నిర్ణయంపై మిగతా ఏనుగుల యజమాన్యాలు సంఘీభావం ప్రకటించారు. రామచంద్రన్ రాకపోతే తమ ఏనుగులను ఉత్సవాలను పంపించబోం అంటూ గట్టిగా కూర్చొన్నారు. దీంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. రామచంద్రన్ ఆరోగ్యంపై డాక్టర్లు క్లీన్ సర్టిఫికేట్ ఇస్తే ఉత్సవాలను అనుమతిస్తామంటూ కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ఉదయం గజరాజును పరీక్షించిన డాక్టర్లు, ఆరోగ్యం బావుందంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టీవీ అనుమప మాట్లాడుతూ.. ‘‘రామచంద్రన్ ఫిట్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇంకా నా దగ్గరకు రాలేదు. విలంబరమ్ ఉత్సవాల్లో ఆలయ పరిసరాల్లో మాత్రమే రామచంద్రన్‌ను అనుమతించాలని మేము భావిస్తున్నాం’’ అంటూ పేర్కొన్నారు. మొత్తానికి తమ ఫేవరెట్ గజరాజుకు అనుమతి రావడంతో కేరళవాసులు ఖుషీలో ఉన్నారు.
రామచంద్రన్ చరిత్ర కాగా తెచ్చికొట్టుకవు రామచంద్రన్ అని పిలవబడే ఈ గజరాజు స్వస్థలం బీహార్. 1982లో దాన్ని కేరళకు తీసుకొచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద గజంగా పేర్కొందిన రామచంద్రన్‌కు మొదట హిందీ మాత్రమే అర్థం అయ్యేది. అయితే కేరళకు వచ్చిన తరువాత మలయాళం అర్థం అవ్వకపోవడంతో విచిత్రంగా ప్రవర్తించేది. దీంతో మావటి దాని కన్నుపొడవడంతో దాని చూపు కాస్త పోయింది. అంతేకాదు కోపిష్ఠి గజరాజుగా పేరున్న రామచంద్రన్.. పలు సందర్భాలలో 11మంది మనుషులు, మూడు ఏనుగులను పొట్టనపెట్టుకుంది. అయితే కేరళలో ఈ గజరాజుకు అభిమానులు చాలామందే ఉన్నారు. దీని పేరిట ఫేస్‌బుక్‌లో ఓ పేజీని కూడా నిర్వహిస్తున్నారు.



