సీబీఐకి చిక్కిన బొల్లినేని గాంధీ.. నిందితురాలిగా భార్య శిరీషా

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ యాంటీ ఏవియేషన్ వింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడంతో ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. అంతేకాదు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును పరుగులు పెట్టించిన గాంధీ కూడా ఈయనే. హైదరాబాద్‌, విజయవాడలతో పాటు […]

సీబీఐకి చిక్కిన బొల్లినేని గాంధీ.. నిందితురాలిగా భార్య శిరీషా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2019 | 11:07 AM

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్‌ గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ యాంటీ ఏవియేషన్ వింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడంతో ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. అంతేకాదు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును పరుగులు పెట్టించిన గాంధీ కూడా ఈయనే. హైదరాబాద్‌, విజయవాడలతో పాటు ఏకకాలంలో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన సీబీఐ అధికారులు గాంధీని పట్టేశారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ తనిఖీల్లో మొత్తం రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. వీరి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని కేంద్ర జీఎస్‌టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో గాంధీ, ఆయన సతీమణి శిరీషాలను కూడా నిందితులుగా చేర్చారు.