Bird Flu Scare: దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. చికెన్, గుడ్లు తినడం సురక్షితమేనా? ఎలా ఉడికించాలి.. ఎలా తినాలి.!

ఈ వైరస్ సోకిన పక్షుల నుంచి మనుషులకీ కూడా చాలా త్వరగా సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్5ఎన్1 మొదటగా 1997 లో మనుషుల్లో గుర్తించారు. ఇది సోకిన వారిలో సుమారుగా అరవై శాతం మంది మరణించారు.

Bird Flu Scare: దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. చికెన్, గుడ్లు తినడం సురక్షితమేనా? ఎలా ఉడికించాలి.. ఎలా తినాలి.!
Follow us
Sanjay Kasula

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 05, 2021 | 6:56 PM

Bird Flu Scare : ఒకవైపు కరోనా, మరోవైపు న్యూ స్ట్రెయిన్స్‌..ఇవి చాలవన్నట్లు కొత్తగా మరో వైరస్ దాడికి సిద్ధమవుతోంది. ఏడాది కాలంగా వణికిస్తున్న కోవిడ్‌ను అంతం చేసే వ్యాక్సిన్ వస్తోందని సంతోషపడుతుండగా.. ఆ ఆశలపై నీళ్లు చల్లుతోంది ఈ నయా వైరస్. ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసిరింది. ఇప్పుడు సౌత్ ఇండియాను తాకింది. రాజస్తాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అలజడి సృష్టిస్తోంది. ఈ వైరస్‌ ధాటికి పౌల్ట్రీ పరిశ్రమ వణికిపోతోంది.

తొలుత రాజస్థాన్‌లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా కేరళలోని రెండు జిల్లాల్లో, అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ మరికొన్ని కేసులు బర్డ్‌ ఫ్లూగా తేలాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌ నెలకొంది. కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బాతులు, కోళ్లు ఉన్నపళంగా మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో 12 వేల బాతులు చనిపోయాయి. వీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించగా వాటిలో ఏవియన్ ఫ్లూ కారక H5N8 వైరస్ ఉన్నట్లు గుర్తించారు.

కేరళలో బర్డ్‌ ఫ్లూ చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్‌ పరిధిలోని బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపేయాలని నిర్ణయించారు అధికారులు. కిల్లింగ్ ఆపరేషన్ చేపట్టేందుకు ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దించారు. కిలోమీటర్ పరిధిలో పౌల్ట్రీలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి.. ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న సమయంలో చికెన్, గుడ్లు తినడం సురక్షితమేనా?

బర్డ్ ఫ్లూ లో హెచ్5ఎన్1 అనేది సహజం. అయితే ఇది పక్షులకి మాత్రం ప్రాణాంతకమైనది… ఈ వైరస్ సోకిన పక్షుల నుంచి మనుషులకీ కూడా చాలా త్వరగా సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్5ఎన్1 మొదటగా 1997 లో మనుషుల్లో గుర్తించారు. ఇది సోకిన వారిలో సుమారుగా అరవై శాతం మంది మరణించారు. బర్డ్ ఫ్లూలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హెచ్5ఎన్1 (H5N1) వైరస్ అనేది మనుషులకి సోకిన మొట్టమొదటి వైరస్. తొలిసారిగా ఈ వైరస్‌ 1991 లో హాంగ్‌కాంగ్‌లో భయటపడింది. ఈ బర్డ్ ఫ్లూ సొకిన పక్షి నుండి మనుషులకి వ్యాప్తి చెందింది.

ఇది ఎలా వ్యాపిస్తుందనేదానిపై పరిశోధకులు కొన్ని నమ్మలేని నిజాలను భయట పెట్టారు. సరిగ్గా ఉడికించని పౌల్ట్రీ, ఎగ్స్ తీసుకోవడం వల్ల బర్డ్ ఫ్లూ సోకదని తెలిపారు. అయితే, కోడి గుడ్లు, బాతు గుడ్లు చాలా సేపు ఉడికించాలి… లేకుంటే ఇలాంటి చికెన్‌ నుంచి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే ఛాన్స్ ఉందని తెలిపారు. కోడి మాంసంను 165 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉడికించాలని సూచించారు.

ఇక ఇలాంటి పరిస్థితిలో కోడి మాంసం, గుడ్లను తినవచ్చా..

ఇలాంటి సమయంలో కోడి మాంసం తినవచ్చు. కాకపోతే మార్కెట్ నుంచి వాటిని తెచ్చాక చేతులను, అవి తాకిన శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్లను అయితే బాగా ఉడకబెట్టాలి. ఇక చికెన్ అయితే 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు ఉడకాలి. అలా ఉడికించి తింటే ఏమీ కాదని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

మరికాసేపట్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదోన్నతులపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష విగ్రహాల విధ్వంసంపై చిన జీయర్ స్వామి ఆగ్రహం.. ఈనెల 17 నుంచి దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటన

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!