Megastar Chiranjeevi: ‘ఆచార్య’ ఆడియో రైట్స్ రికార్డ్స్.. భారీ డీల్ కుదుర్చుకున్న ఆదిత్య మ్యూజిక్..
ఇటీవల ఖైదీ 150 సినిమా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన ఫాంను మొదలుపెట్టాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై అభిమానుల అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
ఇటీవల ఖైదీ 150 సినిమా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన ఫాంను మొదలుపెట్టాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై అభిమానుల అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చిత్రబృందం ప్రారంభించినట్లుగా సమాచారం. ఇక ‘ఆచార్య’ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ సంస్థ భారీ మొత్తం చెల్లించి తీసుకున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకు సంబంధించిన వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆచార్య ఆడియో రైట్స్ కోసం ఆదిత్య మ్యూజిక్ మొత్తంగా రూ.4 కోట్లు చెల్లించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరంజీవి సతిమణి శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.