కోవిడ్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ గుడ్ న్యూస్.. 60 శాతం ప్రభావం చూపిస్తున్న ‘కోవాగ్జిన్’..

ప్రపంచదేశాలను కరోనా సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తొలిదశ తరహాలో మరోసారి వైరస్ విజృంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని...

  • Updated On - 1:37 pm, Sun, 22 November 20 Edited By: Pardhasaradhi Peri
కోవిడ్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ గుడ్ న్యూస్.. 60 శాతం ప్రభావం చూపిస్తున్న 'కోవాగ్జిన్'..

Bharat Biotech: ప్రపంచదేశాలను కరోనా సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తొలిదశ తరహాలో మరోసారి వైరస్ విజృంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్యులు సూచిస్తుండటంతో ఇప్పటికే పలు దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అలాగే మన దేశంలోని పలు నగరాల్లో కూడా నైట్ కర్ఫ్యూలు, సెక్షన్ 144 అమలవుతోంది. దీనితో శాస్త్రవేత్తలు అహర్నిశలూ కరోనా వ్యాక్సిన్ తయారీపై నిమగ్నమయ్యారు. అలాగే ఇండియాలో కూడా పలు సంస్థలు కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఆ జాబితాలో భారత్ బయోటెక్ ముందు వరుసలో ఉంది.

ఈ సంస్థ ‘కోవాగ్జిన్’ పేరుతో అభివృద్ది చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్.. చివరి దశ ట్రయిల్స్ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా ఆ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. తమ వ్యాక్సిన్ 60 శాతం మేర ప్రభావం చూపిస్తుందని సంస్థ పేర్కొంది. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని.. వైరస్‌ను కట్టడి చేయడంలో తమ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తుందని భారత్‌ బయోటెక్‌ సంస్థ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ ప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో దేశంలోని 25 కేంద్రాల్లో 26,000 మందిపై మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!