తెలంగాణలో స్ట్రైక్.. APSRTC ఏంచేసిందంటే.. ?

దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు సొంత ఊర్లకు పయనమయ్యారు. కాగా పాసింజర్స్‌కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ… హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:27 pm, Sun, 6 October 19
తెలంగాణలో స్ట్రైక్.. APSRTC ఏంచేసిందంటే.. ?

దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు సొంత ఊర్లకు పయనమయ్యారు. కాగా పాసింజర్స్‌కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ… హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నుంచి 110, బెంగుళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 బస్సు సర్వీసులను ఏపీకి నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో …బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో పండుగలకు సొంత ఊర్లకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రెండోరోజు పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో పండుగ పూట ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శనివారం ఇమ్లీబన్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్ల నుంచి ఏపీ బస్సులు సేవలందిసున్నట్లు తెలిపారు. దాదాపు 2 వేల మేర బస్సులు హైదరాబాద్‌కు అదనంగా వచ్చాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కొంత ఊరట లభించింది. మరో ఐదారు రోజుల పాటు ఏపీ బస్సులు తిరగనున్నాయి. మరోవైపు టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ సమ్మెకు..ఏపీఎస్‌ ఆర్టీసీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.