అద్భుతంగా పనిచేస్తోన్న ఆర్బిటర్.. చంద్రుడి గురించి ఏం చెప్పిందంటే..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 పూర్తిగా విఫలం కాలేదని చీఫ్ కె. శివన్ వెల్లడించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 98శాతం చంద్రయాన్ 2 విజయవంతమైందని అన్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు శాస్త్రవేత్తలు రాత్రి, పగలు చాలా ప్రయత్నాలు జరిపారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ బాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. చంద్రయాన్​2 ఆర్బిటర్​లోని పేలోడ్​ క్లాస్​ (చంద్రయాన్​2 లార్జ్​ ఏరియా […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:19 pm, Sun, 6 October 19
అద్భుతంగా పనిచేస్తోన్న ఆర్బిటర్.. చంద్రుడి గురించి ఏం చెప్పిందంటే..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 పూర్తిగా విఫలం కాలేదని చీఫ్ కె. శివన్ వెల్లడించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 98శాతం చంద్రయాన్ 2 విజయవంతమైందని అన్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు శాస్త్రవేత్తలు రాత్రి, పగలు చాలా ప్రయత్నాలు జరిపారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ బాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. చంద్రయాన్​2 ఆర్బిటర్​లోని పేలోడ్​ క్లాస్​ (చంద్రయాన్​2 లార్జ్​ ఏరియా సాఫ్ట్​ ఎక్స్​రే స్పెక్ట్రోమీటర్​) చంద్రుడి మీద చార్జ్​డ్​ పార్టికల్స్​ సాంద్రతను గుర్తించిందని ఆయన తెలిపారు. చంద్రుడి మీద సోడియం, కాల్షియం, అల్యూమినియం, సిలికాన్​, టైటానియం, ఐరన్​ వంటి మూలకాలను కూడా గుర్తించినట్లు శివన్ పేర్కొన్నారు. అయితే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను సూర్యుడి నుంచి సౌర వ్యవస్థలోకి వస్తుంటాయి. వాటిని సౌర గాలులు అంటారు. అవి సెకనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంటాయి. కానీ భూమికి అయస్కాంత క్షేత్రం ఉండటం వలన, సౌర గాలుల ప్లాస్మా భూమిని చేరకుండా అడ్డుకునే విషయం తెలిసిందే.