72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.. విజయవాడ మున్సిపల్ స్టేడియం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మువ్వన్నెల కాంతులతో మున్సిపల్ స్టేడియం మెరిసిపోతోంది.గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, మంత్రులు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు.