Republic day 2021 Live Updates: ఘనంగా గణతంత్ర దినోత్సవం.. తెలంగాణలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
ఆరున్నరేళ్ల కృషి ఫలితంగా తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని గవర్నర్ తమిళసై తెలిపారు.

Republic day 2021: హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అతితక్కువ వయసున్న యంగ్ స్టేట్‌గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులతో తెలంగాణ రైతాంగం ఘన విజయం సాధిస్తుందన్నారు.
LIVE NEWS & UPDATES
-
గాంధీభవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు
గాంధీభవన్‌లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
-
మదీనా వద్ద జెండా ఎగురవేసిన అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ పాతబస్తీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మదీనా చౌరస్తాలో మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు.
-
-
తొలి టీకా హైదరాబాద్‌లో తయారు కావడం గర్వకారణంః తమిళసై
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే ఔషధం తెలంగాణలో తయారు కావడం గర్వకారణమన్న గవర్నర్.. స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్‌తో ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తొలి టీకాను అందించింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని గవర్నర్ అన్నారు.
-
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాంః గవర్నర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో 91 శాతం సంక్షరక్షించాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలన్నారు.
-
పల్లె ప్రగతి పథకం దేశానికి ఆదర్శంః గవర్నర్
జాతీయ జెండావిష్కరణ అనంతరం గవర్నర్ తమిళసై సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని గవర్నర్ తమిళసై ప్రశంసించారు. ముఖ్యంగా పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయన్నారుజ పల్లె ప్రగతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
-
-
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రగతి భవన్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
-
సిద్ధిపేట కోట బురుజుపై జాతీయ జెండావిస్కరించిన మంత్రి హరీష్‌రావు
72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. సిద్ధిపేట జిల్లాలోని చారిత్రాత్మక బురుజుపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవలనే ఉద్దేశంతో వాటిపై జాతీయ జెండా ఎగురవేశామని చెప్పారు.
-
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర వ్యవసాయ చట్టానికి తెలంగాణ రైతులు పూర్తి మద్దతు తెలుపుతున్నందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు.
-
అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉందిః గవర్నర్
వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళసై అన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండావిష్కరణ అనంతరం ప్రసంగించారు. ఐటీ, ఔషధ, లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు హబ్‌గా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ.. వెనుకబాటుతనాన్ని అధిగమించి శరవేగంగా బంగారు తెలంగాణ నిర్మాణంవైపు అడుగులు వేస్తున్నదని అన్నారు.
-
దేశ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు#గణతంత్రదినోత్సవం #RepublicDay #गणतंत्रदिवस pic.twitter.com/veFwuAXNBq
— KTR (@KTRTRS) January 26, 2021
-
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
-
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
తెలంగాణాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పబ్లిక్ గార్డెన్ లో జరుగుతున్న వేడుకలల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు.
-
హైకోర్టు లో జాతీయ జెండాను ఆవిష్కరించిన చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ
తెలంగాణ హైకోర్టు లో ఘనంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ ఆవిష్కరించారు. వేడుకల్లో పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ మెంబర్స్, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
-
మేడ్చల్‌లో జెండావిష్కరించిన మంత్రి మల్లారెడ్డి
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. మంత్రి ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి ,త్రివర్ణ పతాకం ఎగురవేసి ,అనంతరం పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.
-
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లకిడికాపూల్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని అడిషనల్ డీజీపీ బాలనాగ దేవి ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
Published On - Jan 26,2021 11:59 AM