AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 232 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 40,177 నమూనాలను టెస్ట్ చేయగా 232 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,082కి చేరుకుంది.

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 40,177 నమూనాలను టెస్ట్ చేయగా 232 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,082కి చేరుకుంది. కొత్తగా కరోనా కారణంగా నలుగురు ( చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున) ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,115కి చేరింది. తాజాగా 352 మంది వైరస్ నుంచి కోలుకోగా..మొత్తం రికవరీల సంఖ్య 872897కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,070 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,19,72,780 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ ఆదివారం రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read :
TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు
Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?