Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు

అసలే సంక్రాంతి..ఇంటికి బోలెడన్నీ గిఫ్ట్‌లు, బట్టలు తీసుకెళ్లాలి. వచ్చేటప్పుడు కూాడా గంపెడు పిండివంటలతో రావాలి. ఈ క్రమంలో ప్రయాణం చాలా ప్రయాసతో కూడుకున్న పనే. అందుకే టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.

TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు
TSRTC
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2021 | 5:58 PM

అసలే సంక్రాంతి..ఇంటికి బోలెడన్నీ గిఫ్ట్‌లు, బట్టలు తీసుకెళ్లాలి. వచ్చేటప్పుడు కూాడా గంపెడు పిండివంటలతో రావాలి. ఈ క్రమంలో ప్రయాణం చాలా ప్రయాసతో కూడుకున్న పనే. అందుకే టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రయాణీకులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంటి వద్దకే బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నివశించేవారు సుమారు 35 నుంచి 40 మంది వరకు ఉంటే వారికి ఓ ప్రత్యేక బస్సును నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుని ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సును నడిపించాలని నిర్ణయించింది. ఎలాంటి ట్రావెల్ కష్టాలు లేకుండా ఎంచక్కా కుటుంబసభ్యులతో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి సొంతూళ్లకు సురక్షితంగా చేరుకోండని విజ్ఞప్తి చేస్తోంది. సంక్రాంత్రి స్పెషల్ సర్వీసులకు చెల్లించే ఛార్జీలనే చెల్లించి ఈ సర్వీసును వినియోగించుకోవచ్చని వివరించింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా ఆర్టీసీ సేవలను విస్తరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీకి ఫోన్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్​లోని ఒకే ప్రాంతానికి చెందిన వారంతా… తెలంగాణలోని ఒకే ఏరియాలో పనిచేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 8 నుంచి 14 వరకు 4,980 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్న విషయం తెలిసిందే.

తెలంగాణలోని వివిధ జిల్లాలకే కాకుండా ఏపీలోని విజయవాడ, ర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు,  కాకినాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, రాజోలు, పోలవరం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం, క తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపడానికి నగరంలోని వివిధ పాయింట్ల నుంచి ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు.

Also Read :

Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?

Btech Ravi Arrest : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌…ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ramatheertham Live Updates: నేతల పర్యటన, కార్యకర్తల ఆందోళనలు .. రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం..