Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Btech Ravi Arrest : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌…ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. తాజాగా చెన్నైలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా లింగాల మండలం...

Btech Ravi Arrest : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌...ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2021 | 7:11 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. తాజాగా చెన్నైలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాలలో డిసెంబర్‌ 19న దళిత మహిళ హత్యకు గురైంది. ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీటెక్‌ రవి నేతృత్వంలో టీడీపీ నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు.

అయితే హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారని.. తమ కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యలు చెప్పారు. అంతేకాదు తమ పరువుకు భంగం వాటిల్లేలా ర్యాలీ నిర్వహించారంటూ ఆరోపించారు.ఈ విషయంలో హత్యకు గురైన దళిత మహిళ తల్లి పోలీసులకు డిసెంబర్‌ 22న ఫిర్యాదు చేయడంతో… బీటెక్‌ రవి సహా 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్కైంది.  ఈ కేసులో భాగంగా బీటెక్ రవిని చెన్నైలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ కేసు విషయంలో కాస్త సందిగ్ధత నెలకుంది.  ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో తనని అరెస్ట్ చేశారని బీటెక్ రవి అంటుంటే..కాదంటూ ఎస్పీ అన్బు రాజన్ వివరణ ఇచ్చారు. 2018 నాటి ఘర్షణ కేసులో అరెస్ట్ చేసామంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2018 లో పులివెందుల పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్లు, ఘర్షణలో  బీటెక్ రవి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Also Read : Ramatheertham Live Updates: నేతల పర్యటన, కార్యకర్తల ఆందోళనలు .. రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం..