దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌

ఎస్సీ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4..

దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌
Follow us

|

Updated on: Jan 03, 2021 | 5:22 PM

ఎస్సీ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులకు లాభం జరుగుతుందన్నారు. ఇంత వరకు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు – హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై కాలయాపన చేస్తే ఉద్యమిస్తామన్నారు.

ఎస్సీ విద్యార్థులకు ప్రోత్సాహం లేకపోవడంతో వారు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు. దీన్ని గ్రహించి ప్రధాని మోదీ వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కేంద్రం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తోందని తెలిపారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేసిన ఆయన, 1990 నుంచి సివిల్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. లేకుంటే 2023 లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రమోషన్ల పక్రియ ప్రారంభిస్తామని బండి సంజయ్‌ చెప్పారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్