Building Collapsed: యూపీలోని మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. 21 మంది దుర్మరణం..
Building Collapsed: ఢిల్లీలోని గజియాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది..
Building Collapsed: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల మురాద్ నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్మశానవాటికలోని కాంప్లెక్స్ గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పైకప్పు కూలిన సమయంలో 100 మందికి పైగా అక్కడ ఉన్నట్లు సమాచారం.
కాగా, ఓ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనేందుకు బంధవులంతా వచ్చారు. అదే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా ఆ శ్మశానంలో ఉన్న కాంప్లెక్స్ గ్యాలరీలో తలదాచుకున్నారు. అయితే అది కొత్తగా నిర్మించినది కావడం, భారీ వర్షం కారణంగా పూర్తిగా నానడంతో గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో దానికింత తలదాచుకున్న వారంతా అందులో చిక్కుపోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also read: