Covaxin Vaccines Approved: కరోనా మహమ్మారిని పీచమణిచేందుకు వస్తోన్న తొలి స్వదేశీ టీకా.. కొవాగ్జిన్ ప్రత్యేకతలివే..!

Covaxin vaccines: దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు తయారు చేసిన తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Covaxin Vaccines Approved: కరోనా మహమ్మారిని పీచమణిచేందుకు వస్తోన్న తొలి స్వదేశీ టీకా.. కొవాగ్జిన్ ప్రత్యేకతలివే..!
Follow us

|

Updated on: Jan 03, 2021 | 3:12 PM

Covaxin Vaccines Approved: దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు తయారు చేసిన తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఆదివారం పచ్చ జెండా ఊపింది. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాకు కూడా అనుమతి లభించింది. దీనిని కూడా పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి వాడొచ్చని డీసీజీఐ ప్రకటించింది. కరోనా వైరస్ రూపాంతరం చెంది మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ తెలిపింది.

కొవాగ్జిన్ పూర్తి స్వదేశీ తయారీ టీకా కావడంతో యావత్ ప్రపంచ దృష్టి దీనిపై కేంద్రీకృతమై ఉంది. డీసీజీఐ అనుమతితో మరికొద్ది రోజుల్లో ఈ టీకా ప్రజలకు అందుబాటులో రానుండగా.. భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే దేశానికి అవసరమైన కొవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. దాదాపు కోటి డోసులను సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారీ చేసే సామర్థ్యం కంపెనీకి ఉందని తెలిపింది. అవసరాన్ని బట్టి మరింత ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. అయితే, ప్రతి వ్యక్తి ఈ టీకాను తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 28 రోజులు తరువాత మరో డోసు ఇస్తారు. కాగా, ఈ టీకా కొత్తరకం కరోనా వైరస్‌లపైనా పని చేస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదిలాఉంటే.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అందించిన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ స్ట్రెయిన్‌తో భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌కు చెందిన యూనిట్లోని బీఎస్‌ఎల్‌(బయో సేఫ్టీ లెవల్‌)- 3 యూనిట్‌లో తయారు చేసిన ఈ టీకా మొదటి, రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26వేల మందిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను భారత్‌ బయోటెక్‌ చేపట్టగా.. ఈ టీకా ఎంతో సురక్షితమైనదిగా తేలింది. ఎలాంటి దుష్ప్రభావాలు చూపించకపోగా.. 65 శాతానికిపైగా ప్రభావం చూపించినట్లు గుర్తించారు. కాగా, ఈ టీకా ఇన్‌యాక్టివేటెడ్ రకానికి చెందినది. దీన్ని కరోనా బాధితుల శరీరంలోకి ఎక్కిస్తే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. వ్యాధికారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేస్తుంది.

Also read:

Breaking: కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి..

Bank Officials Scam: రైతుల పేరిట బ్యాంక్ అధికారుల భారీ స్కాం.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు