ఆస్పత్రిలో టాలీవుడ్ హీరోయిన్.. కష్టంగా ఉందంటూ ఎమోషనల్
06 May 2024
. హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర తదితర సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది దక్షా నగార్కర్.
ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలపైనే అవుతోంది. ఇన్నేళ్లలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేసింది దక్ష.
అలాగే నాగార్జున, నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసిందీ అందాల తార.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే దక్షా నగార్కర్ ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో దక్ష నగార్కర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజి క మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
తెలియని వ్యక్తుల మధ్య ఆపరేషన్ గదిలో పడి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే వెన్నెముకకు రెండుసార్లు మత్తు మందుసూదులు గుచ్చారు'
దీని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నా ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను'
ఈ క్లిష్ట సమయంలో నా అభిమానులు నాకు అండగా నిలబడ్డారు' అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది దక్ష. అయితే ఏమైందో మాత్రం తెలపలేదు.
ఇక్కడ క్లిక్ చేయండి..