తేనె, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎంతగానో ఉపయోగపతాయి.
కండరాల వాపులు, కండరాల నొప్పులతో ఇబ్బంది పడే వారికి తేనె, దాల్చిన చెక్క బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దాల్చిన చెక్కడ పొడిలో కాస్త తేనె కలుపుకొని తీసుకోవాలి.
ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా తరచూ జలుబు, జ్వరం రావడం వంటి సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.
ఇక దాల్చిన చెక్క, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడే వారు ఈ రెండింటిని కలిపి చర్మానికి రాయడం వల్ల సమస్యదూరమవుతుంది.
ముఖం అందానికి కూడా ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోపడుతుంది. ముఖంపై ఉండే కురుపులు, దద్దుర్లు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
కీళ్ల నొప్పులు తగ్గించడంలో కూడా ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు తేనె కలిపి ఈ మిశ్రమాన్ని నొప్పులున్న చోట మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం