AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DCGI LIVE Updates : రెండు వ్యాక్సిన్లకు నిపుణుల కమిటీ ఓకే.. అనుమతులపై డీసీజీఐ క్లారిటీ

నిపుణుల కమిటీ సిఫార్సుపై డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా - డీసీజీఐ తుది నిర్ణయం తీసుకుంది.

DCGI LIVE Updates : రెండు వ్యాక్సిన్లకు నిపుణుల కమిటీ ఓకే.. అనుమతులపై డీసీజీఐ క్లారిటీ
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jan 03, 2021 | 9:29 PM

Share

DCGI LIVE updates : కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. టీకా అందుబాటులోకి వచ్చే విషయంపై కీలక వివరాలు వెల్లడించింది. వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి నిన్న నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jan 2021 01:06 PM (IST)

    తెలంగాణలో తయారైన టీకాలకు డీసీజీఐ ఆమోదం తెలపడంపై మంత్రి కేటీఆర్ హర్షం

    కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారుతోందని అన్నారు. ఆదివారం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషితో హైదరాబాద్‌కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు.

  • 03 Jan 2021 12:43 PM (IST)

    కరోనా‌పై యద్ధంలో కీలక మలుపు..ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం..-ప్రధాని మోదీ

    భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కరోనా‌పై యద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు.

    ఈ నిర్ణయం భారత్‌ ఆరోగ్యవంతమైన కొవిడ్‌ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందని తెలిపారు. దేశప్రజలకు, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కృషి చేసి శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌లోనే తయారు కావడం గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు.

    భారత శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేసేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు ఈ ఘటన ఉదాహరణ అని పేర్కొన్నారు.

  • 03 Jan 2021 12:13 PM (IST)

    టీకా పంపిణీ ఎప్పుడు..? ఎన్ని రోజులు..? ఎన్ని డోసులు..?

    కొవాగ్జిన్‌ తయారీని ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. కోటి డోసులు ఉత్పత్తయ్యాయి. తుది అనుమతి రాగానే వీటిని పంపిణీ చేస్తారు. కంపెనీకి ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంటుంది. అవసరాన్ని బట్టి అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకోవటానికీ కంపెనీ సిద్ధంగా ఉంది. ఇంజెక్షన్‌ ద్వారా ఈ టీకాను ఇస్తారు. తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండో డోసు ఇస్తారు.

  • 03 Jan 2021 12:07 PM (IST)

    సీరం శ్రమ ఫలించింది – అదర్‌ పూనావాలా, సీఈవో సీరం ఇన్‌స్టిట్యూట్‌

    కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతిపై  సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా ధన్యవాదాలు తెలిపారు. తమ శ్రమ ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు.

    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వ్యాక్సిన్‌ తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్‌ తీసుకున్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. భారత్‌లో తొలి కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ వినియోగానికి అనుమతి లభించింది. సురక్షితమైన, సమర్థవంతమైన ఈ టీకా రానున్న కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది

  • 03 Jan 2021 11:48 AM (IST)

    ఈ రెండు టీకాలు 110 శాతం సురక్షితం- వి.జి.సోమాని

    భద్రత విషయంలో స్వల్పంగా ఉంటే మేము దేనినీ ఆమోదించమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వి.జి.సోమాని వెల్లడించారు. ఈ రెండు టీకాలు 110 శాతం సురక్షితం అని ప్రకటించారు. తేలికపాటి జ్వరం, నొప్పితోపాటు అలెర్జీ వంటి కొన్ని దుష్ప్రభావాలు ప్రతి టీకాకు సాధారణం అని అన్నారు.

  • 03 Jan 2021 11:34 AM (IST)

    నిపుణుల కమిటీ సిఫారసులు ఇవే..

    ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ అత్యవసర వినియోగం కోసం సిఫారసులు చేసిన 24 గంటల్లోపే..కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ రెండు వ్యాక్సిన్స్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది.

  • 03 Jan 2021 11:31 AM (IST)

    అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది

    ఆక్స్‌ ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు.. భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన ఆమోదం తెలపాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ.

  • 03 Jan 2021 11:30 AM (IST)

    కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్..టీకా వినియోగం, అనుమతులపై డీసీజీఐ కీలక ప్రకటన

    కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. కోవిడ్‌ నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు టీకాను ప్రజలకు అందుబాటులోకి కేంద్రం తీసుకొచ్చింది. టీకా వినియోగం, అనుమతుల విషయంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసింది. కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

  • 03 Jan 2021 11:26 AM (IST)

    కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి..

    కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యం, భద్రత ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించింది. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది.

  • 03 Jan 2021 11:17 AM (IST)

    కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి..

    కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. ఈ రెండు టీకాలను సీడీఎస్‌సీవో సిఫారసు చేసిందని తెలిపింది.  అత్యవసర వినియోగానికి షరతులతో అనుమతి ఇచ్చినట్లుగా వెల్లడించింది.

  • 03 Jan 2021 11:10 AM (IST)

    కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ భావించింది..

    కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన ఆమోదం తెలపాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ.. ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ అత్యవసర వినియోగం కోసం సిఫారసులు చేసిన 24 గంటల్లోపే..కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ భావించింది

  • 03 Jan 2021 11:09 AM (IST)

    టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర..

    ఆక్స్‌ ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది.

  • 03 Jan 2021 11:05 AM (IST)

    డీసీజీఐ ఆమోదిస్తే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్…

    మొన్న.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ.. కోవాగ్జిన్‌పై మరింత అదనపు సమాచారం కావాలని.. భారత్‌ బయోటెక్‌ను కోరింది. నిన్న ఆ సమాచారాన్ని పరిశీలించిన కమిటీ.. సంతృప్తి చెంది.. ఎమర్జెన్సీ యూసేజ్‌కు ఓకే చెప్పేసింది. నిపుణుల కమిటీ సిఫార్సుపై డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా – డీసీజీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీసీజీఐ ఆమోదిస్తే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలుకానుంది.

Published On - Jan 03,2021 9:10 PM