Anushka Sharma: ఫోటోగ్రాఫర్పై విరుచుకుపడిన అనుష్క.. ఎన్నిసార్లు చెప్పినా మారరా.. ఇప్పుడే ఇది ఆపండి అంటూ..
సెలబ్రెటీలు ఏం చేస్తున్నా.. ఎక్కడికి వెళ్తున్నా.. ఫోటోగ్రాఫర్లు వారిని అనుసరిస్తూనే ఉంటారు. వారి అనుమతులు లేకుండానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
సెలబ్రెటీలు ఏం చేస్తున్నా.. ఎక్కడికి వెళ్తున్నా.. ఫోటోగ్రాఫర్లు వారిని అనుసరిస్తూనే ఉంటారు. వారి అనుమతులు లేకుండానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. బయటి ప్రదేశాల్లోనే కాకుండా వాళ్ళు ఇంట్లో ఉన్న ఫోటోలను కూడా వారికి తెలియకుండా తీసేస్తారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఫోటోగ్రాఫర్లకు అలా చేయకూడదు అని కోప్పడినా సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ విషయాలలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో సదరు ఫోటోగ్రాఫర్ పై అనుష్క తన ఇన్స్టాగ్రామ్ వేదికగా విరుచుకుపడింది.
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం తన భర్త విరాట్‌తో కలిసి తన ఇంట్లోని బాల్కానీలో కూర్చోని టైం స్పెండ్ చేస్తున్నారు. వారిద్దరు అలా కూర్చున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ ఆ చిత్రాన్ని వారికి తెలియకుండా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ ఫోటో చూసిన అనుష్క దానిని తన ఇన్‌స్టా స్టోరీలో అప్లోడ్ చేసి ఆ ఫోటోగ్రాఫర్ పై విరుచుకుపడింది. “ఎన్నిసార్లు చెప్పినప్పటీకి ఆ ఫోటోగ్రాఫర్లు సోషల్ మీడియాలో మా ప్రైవసీ ఫోటోలను పబ్లిష్ చేయడం మానడం లేదు. ఇకనైనా దీనిని ఆపండి” అని రాసుకోచ్చింది.
ఇటీవల కాలంలో అనుష్క ట్రెడ్మిల్ పై నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డాక్టర్ల సూచన మేరకే తాను ఇలా చేస్తున్నాని చెప్పుకోచ్చింది ఈ భామ. అంతకు ముందు అనుష్క బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
Also Read:
Anushka Sharma: ఈ సమయంలోనూ ఫిట్‌నెస్‌పై ధ్యాస పెట్టి అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..