భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

ఏపీలో రేపటి నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..
Follow us

|

Updated on: Jun 07, 2020 | 3:32 PM

అన్‌లాక్ 1 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏపీలో రేపటి నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు, ఎల్లుండి ట్రయిల్ రన్‌లో భాగంగా అధికారులు, సిబ్బంది దర్శనాలు చేసుకోనుండగా.. 10వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ప్రతీ ఒక్కరూ కూడా మాస్కులు ధరించాలని సూచించారు.

ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు జరగనుండగా.. రోజుకు 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. అలాగే అంతరాలయ దర్శనానికి అనుమతి లేదని వెల్లడించారు. మల్లికార్జున మహా మండపం నుంచి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. మెట్ల మార్గం ద్వారానే దర్శనం చేసుకుని మళ్లీ అలాగే కింది వెళ్లాలని.. బస్సులు, లిఫ్టుల సౌకర్యం ఉండదన్నారు. ఉచిత దర్శనం, రూ. 100 టికెట్లు రెండూ కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బుకింగ్ చేసుకోవాలన్నారు. కాగా, కృష్ణా నదిలో స్నానాలు నిషేధం అన్నారు. కేశఖండనశాల వద్ద భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.

Also Read: 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బోర్డర్‌లో తనిఖీల్లేవు..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..