AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ నిర్మాతలపై కన్నడ నిర్మాతల ఫైర్.. కారణమేంటంటే!

టాలీవుడ్‌ నిర్మాతలపై కన్నడ నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. మమ్మల్ని ఇలానే ఉండనివ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ నిర్మాతలపై కన్నడ నిర్మాతల ఫైర్.. కారణమేంటంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 3:54 PM

Share

టాలీవుడ్‌ నిర్మాతలపై కన్నడ నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. మమ్మల్ని ఇలానే ఉండనివ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వారికి అంతలా ఆగ్రహం రావడానికి గల కారణమేంటంటే..! కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లడిస్తూ ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పత్రికల్లో అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. కన్నడ పత్రికల్లో ఫుల్ పేజీ, జాతీయ పత్రికల్లో అర్ధ పేజీతో అడ్వర్‌టైజ్‌మెంట్ వేయించారు. ఇది కన్నడ నిర్మాతలకు కోపాన్ని తెప్పించింది.

దీంతో అక్కడి నిర్మాతలు ఇక్కడి ప్రొడ్యూసర్‌లకు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారట. ”మా ఇండస్ట్రీని ఇలా వదిలేయండి ప్లీజ్‌. అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చి హీరో, దర్శకులను మెప్పించకండి. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలా చేస్తే ప్రతి దర్శకుడు మా వద్ద నుంచి కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ కావాలని ఆశిస్తుంటారు” అని తమ బాధను వ్యక్తం చేశారట. కాగా ఎన్టీఆర్‌ హీరోగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా తీయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది. అయితే ఎన్టీఆర్‌తో ప్రశాంత్ సినిమా తీయబోతున్నారని తెలిసిన కన్నడ ప్రేక్షకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పేరు సంపాదించుకొని భారీ రెమ్యునరేషన్ కోసం వేరే ఇండస్ట్రీల్లోకి వెళుతున్నారంటూ వారు మండిపడ్డారు. ఈ క్రమంలో ఆ మధ్యన ‘గెట్‌ అవుట్ ప్రశాంత్ నీల్’ హ్యాష్‌ట్యాగ్‌తో వారు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: నా మూవీకి సాయి పల్లవి ఓ అస్సెట్.. దర్శకుడి ప్రశంసలు..!

Follow Us
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు