AP Floods: రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం..

Aandhra Pradesh Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భర్తీ విపత్తు ఏర్పడింది. ముఖ్యంగా కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో..

AP Floods: రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం..
Ap Floods
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2021 | 7:52 PM

Aandhra Pradesh Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భర్తీ విపత్తు ఏర్పడింది. ముఖ్యంగా కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 13 నుంచి 20 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల జన జీవనం అస్తవ్యస్తమైంది.  పంటలు నీట మునిగాయి, పశువులు, కోళ్లు నీటిలో కొట్టుకుని పోయాయి. ఈ జిల్లాలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏపీకి రానున్నది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ కేంద్ర బృందం మూడు రోజులపాటు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలియజేసారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారు.  ఈ నెల 26వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లాలో ఒక బృందం పర్యటించనుంది. ఇక 27వ రెడీ శనివారం చిత్తూరు జిల్లాలో బృందం, కడప జిల్లాలో మరో బృందం పర్యటించనుంది. ఈనెల 28వ తేదీ ఆదివారం నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయని కె కన్నబాబు చెప్పారు. అనంతరం 29వ తేదీ సోమవారం ఈ కేంద్ర బృంద సభ్యులు సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారని చెప్పారు Also Read:  జీహెచ్ఎంసీ చర్యలు.. విద్యుత్ దీప కాంతులతో వెలుగు విరజిమ్ముతున్న నగరంలోని పలు ప్రాంతాలు..