AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM on PRC: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పీఆర్‌సీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో PRC హాట్‌టాఫిక్. నివేదిక కోసం పట్టుబడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. నెలాఖరులోగా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. అయితే త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వినిపిస్తుందన్న టాక్‌ నడుస్తోంది.

AP CM on PRC: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..  త్వరలోనే పీఆర్‌సీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
Ap Cm Ys Jagan
Balaraju Goud
|

Updated on: Nov 25, 2021 | 8:46 PM

Share

AP Government Employees PRC: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో PRC హాట్‌టాఫిక్. నివేదిక కోసం పట్టుబడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. నెలాఖరులోగా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. అయితే త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వినిపిస్తుందన్న టాక్‌ నడుస్తోంది.

కొత్త PRC అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. నెలాఖరులోగా తేల్చాలంటూ డెడ్‌లైన్లు విధించాయి. ప్రభుత్వం నిర్ణయం వచ్చేంత వరకు ఉద్యమించాలని ఉద్యోగ సంఘాల పట్టుదల ఉన్నాయి. అయితే, ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అవసరం లేదు అని మొదటి నుంచి చెబుతోంది ప్రభుత్వం.అయితే,11వ PRC కమిటీ ఛైర్మన్ అశుతోష్‌ మిశ్రా తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే రెండు సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు కూడా జరిగాయి.

అయితే, ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదని కొన్ని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నెలాఖరులోగా ఎదో ఒకటి తేల్చకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించాయి. కాగా, PRCపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలోగా PRC ప్రకటిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. పీఆర్‌సీపై వేసిన కమిటీ నివేదిక ఇచ్చే కంటే ముందే పీఆర్‌సీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అధికారులు, నేతలంతా ఆ బిజీగా ఉన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే.. PRCపై సీఎం నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. నివేదికతో సంబంధం లేకుండానే అందిరికీ అమోదయోగ్యంగా వేతన సవరణ ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది.

Read Also….  Singareni Strike: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగ‌రేణిలో మోగిన స‌మ్మె సైర‌న్.. ఎప్పటి నుంచంటే..?