AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Artist Bakhita : చైల్డ్ ఆర్టిస్టుగా అవార్డు.. అయినా హీరోయిన్‌గా అవకాశాలు వద్దు సమాజ సేవే ముద్దు అంటున్న భకిత

ఎంత సంపాదించినా తమకు ఏముంది అనుకునే వారు కొందరు.. తమకు ఉన్నదానిలోనే పదిమందికి పెట్టాలని.. మంచి చేయాలనుకునే వారు మరికొందరు.. ఇక కొంత మంది సెలబ్రెటీలు

Child Artist Bakhita : చైల్డ్ ఆర్టిస్టుగా అవార్డు.. అయినా హీరోయిన్‌గా అవకాశాలు వద్దు సమాజ సేవే ముద్దు అంటున్న భకిత
Surya Kala
|

Updated on: Jan 24, 2021 | 6:08 PM

Share

Child Artist Bakhita : ఎంత సంపాదించినా తమకు ఏముంది అనుకునే వారు కొందరు.. తమకు ఉన్నదానిలోనే పదిమందికి పెట్టాలని.. మంచి చేయాలనుకునే వారు మరికొందరు.. ఇక కొంత మంది సెలబ్రెటీలు తాము సంపాదించిన దానితో సమాజానికి ఇదొక విధంగా మంచి చేయాలని సేవాకార్యక్రమాలని నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సినీ నటీనటులు ప్రకృతి విపత్తులు ఏర్పడినా.. అభిమానులు అర్ధంగా ఇబ్బందులు పడుతున్నా.. కరోనా వంటి అనుకోని ఆపదలు ఏర్పడినా సేవా దృక్పథంతో ప్రజలను ఆదుకుంటారు.

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తుంటే.. సమంత అక్కినేని ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆపన్నులకు అండగా నిలబడుతుంది. ఇక లాక్ డౌన్ సమయంలో సోను సూద్ చేసిన సాయం అందరికీ ఆదర్శం.. బ్లూ క్రాస్ కు చెందిన అక్కినేని అమల, పెట్టాకి చెందిన త్రిష లు కూడా తమదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరందరూ సినిమాలతో ఓ రేంజ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారే.. కానీ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ సినిమాలో హీరో రాజాని తన ముద్దు ముద్దు మాటలతో ఏడిపిస్తూ.. నటించిన బాలనటి భకిత గుర్తుందా.. ఆ చిన్నారి ఇప్పుడు 25ఏళ్ల యువత. అయితే ఈ భకిత 17 సంవత్సరం నుండే ఓ వినూత్న పోరాటం మొదలు పెట్టింది. మహిళల హక్కుల కోసం, సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లకు కూడా సమన హక్కులు కల్పించాలని, ఆడవారిపై ఎలాంటి దాడులు గాని అత్యాచారాలు గాని జరక్కుండా సరైన చట్టాలను తీసుకురావాలని ఆమె పోరాటం సాగిస్తోంది. సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న తపన తనను ఈ దిశగా ఆలోచించేలా చేసింది అని భకిత చెప్పింది.

ఆనంద్ సినిమాలో నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కించుకున్న భకిత ఆ తర్వాత సినిమాల్లో నటించకుండా దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె అందాన్ని చూసి కొందరు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా.. అని చెప్తే.. తనకు ఇష్టం లేదని చెప్పేసిందట ఈ అమ్మాయి. భకిత ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది అని అంటున్నారు ఆమె సన్నిహితులు

Also Read: ముగిసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు.. మరోసారి వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ