IPL 2021 Auction: ముగిసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు.. మరోసారి వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న లీగ్ గా ప్రాచుర్యం పొందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త వేలం ప్రక్రియ..

IPL 2021 Auction: ముగిసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు.. మరోసారి వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ
Follow us

|

Updated on: Jan 24, 2021 | 5:32 PM

IPL 2021 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న లీగ్ గా ప్రాచుర్యం పొందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త వేలం ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీంతో మరోసారి క్రికెటర్లు వేలానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా వేలం పక్రియ మొదలైంది. ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియడంతో కొత్త వేలం చెన్నై వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది.

ఒక్కో క్రికెటర్ అతని సామర్ధ్యాన్ని బట్టి అమ్ముడుపోతున్నాడు. ఒక్కో ఫ్రాంచైజీ తమ ఆర్ధిక సామర్ధ్యాన్ని బట్టి ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నది. ఇప్పటికే రిటెన్షన్ గడువు ముగిసింది. కొన్ని ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఫిబ్రవరి 4వ తేదీ వరకూ ఏ ఆటగాళ్లను వదులుకునేది..ఎవరిని ఉంచుకునేది వివరాల్ని బీసీసీఐ కు అందించాల్సి ఉంది. ఈ వివరాల ప్రకారం మిగిలిన ఆటగాళ్ల కోసం వివిధ ఫ్రాంచైజీల మధ్య వేలం ఉంటుంది. ప్రస్తుతం ఆటగాళ్లు కొనుగోలు కోసం వివిధ ఫ్రాంచైజీల వద్ద 196 కోట్ల ధనముంది.

ఐపీఎల్ ప్రాంఛైజీలు మొత్తం 139 మంది ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి. 54 మంది క్రికెటర్లను విడుదల చేశాయి. ముగ్గురు ఆటగాళ్ళు .. రాబిన్ ఉతప్ప, డేనియల్ సామ్స్ , హర్షల్ పటేల్ లను వేలం వేయడానికి ముందే కొత్త జట్లు సొంతం చేసుకున్నాయి.

అయితే 2020 ఐపీఎల్ ను కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్‌ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.. అయితే మెగా టోర్నీని ఈసారి భారత్‌లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు గంగూలీ ప్రకటించాడు.

Also Read:  దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డ్..