అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి

అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట మరో మారు పెళ్లి సందడి మొదలైంది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్- శ్లోకా మెహతాల వివాహం మార్చి 9న జరగనుండగా.. దీనికి సంబంధించిన వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్విట్జర్లాండ్‌లో బ్యాచులర్ పార్టీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 500మంది అతిథులు హాజరు అవ్వనుండగా.. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, రణ్‌బీర్ ఇప్పటికే స్విస్ చేరుకున్నారు. స్విస్‌లోని సెయింట్ మోరిట్జ్ సరస్సున ఉండే ఓ హోటల్‌ రెండు రోజుల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:32 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట మరో మారు పెళ్లి సందడి మొదలైంది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్- శ్లోకా మెహతాల వివాహం మార్చి 9న జరగనుండగా.. దీనికి సంబంధించిన వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్విట్జర్లాండ్‌లో బ్యాచులర్ పార్టీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 500మంది అతిథులు హాజరు అవ్వనుండగా.. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, రణ్‌బీర్ ఇప్పటికే స్విస్ చేరుకున్నారు.

స్విస్‌లోని సెయింట్ మోరిట్జ్ సరస్సున ఉండే ఓ హోటల్‌ రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం 5.30గంటలకు పార్టీ ప్రారంభం అయి అర్ధరాత్రి 2గంటల వరకు సాగుతుంది. ఆ తరువాత సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. లగ్జరీకి మారుపేరుగా నిలిచిన ఈ హోటల్‌లో బ్యాచులర్ పార్టీ కోసం అంబానీ దంపతులు పెద్ద అమౌంట్‌నే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu