రాటుదేలాం.. మాతో పెట్టుకోవద్దు: పాక్ మేజర్ జనరల్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. విస్తృతస్థాయిలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమతో పెట్టుకోవద్దని భారత్‌ను హెచ్చరించారు. యుద్ధాలతో రాటుదేలిన పాకిస్థాన్ సైన్యం ఎలాంటి ప్రమాదాన్నయినా తిప్పికొట్టగలదని అన్నారు. తమకై తాము యుద్ధం ప్రారంభించబోమని, అయితే భారతే దాడి చేస్తే ప్రతిదాడి చేస్తామని చెప్పారు. భారత్ యుద్ధానికి కాలుదువ్వుతోందని, పుల్వామా దాడిలో తమపై ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ ఆరోపణలు గుప్పిస్తోందని విమర్శించారు. తమ […]

రాటుదేలాం.. మాతో పెట్టుకోవద్దు: పాక్ మేజర్ జనరల్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:32 PM

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. విస్తృతస్థాయిలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమతో పెట్టుకోవద్దని భారత్‌ను హెచ్చరించారు. యుద్ధాలతో రాటుదేలిన పాకిస్థాన్ సైన్యం ఎలాంటి ప్రమాదాన్నయినా తిప్పికొట్టగలదని అన్నారు.

తమకై తాము యుద్ధం ప్రారంభించబోమని, అయితే భారతే దాడి చేస్తే ప్రతిదాడి చేస్తామని చెప్పారు. భారత్ యుద్ధానికి కాలుదువ్వుతోందని, పుల్వామా దాడిలో తమపై ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ ఆరోపణలు గుప్పిస్తోందని విమర్శించారు. తమ దేశంలో భారతే ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోందని కొత్త వాదన వినిపించారు. 1998లో పాక్ అణుపరీక్షలు జరిపినప్పటి నుంచి ఇది కొనసాగుతోందని పాకిస్థాన్ మేజర్ జనరల్ అన్నారు.