భద్రతా మండలిలో బరితెగించిన చైనా

భద్రతా మండలిలో బరితెగించిన చైనా

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటన చేసింది. దీన్ని అంతర్జాతీయంగా భారత దౌత్యనీతికి దక్కిన విజయంగా చెప్పొచ్చు. అయితే ఈ ప్రకటనను ఆపేందుకు చైనా చివరి వరకూ ప్రయత్నించింది. పైగా ప్రకటన అనంతరం ద్వేషపూరితంగా ప్రవర్తించింది. భద్రతామండలి చేసిన ప్రకటన పుల్వామా దాడి ఘటనపై అంతిమ తీర్పుగా భావించరాదని చెప్పింది. దాడి జరిగిన రోజునే ఫిబ్రవరి 14న భద్రతా మండలి ప్రకటన చేయాలని భావించింది. కానీ తమకు సమయం కావాలంటూ చైనా అడ్డుపడింది. ప్రకటనలో […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:33 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటన చేసింది. దీన్ని అంతర్జాతీయంగా భారత దౌత్యనీతికి దక్కిన విజయంగా చెప్పొచ్చు. అయితే ఈ ప్రకటనను ఆపేందుకు చైనా చివరి వరకూ ప్రయత్నించింది. పైగా ప్రకటన అనంతరం ద్వేషపూరితంగా ప్రవర్తించింది. భద్రతామండలి చేసిన ప్రకటన పుల్వామా దాడి ఘటనపై అంతిమ తీర్పుగా భావించరాదని చెప్పింది.

దాడి జరిగిన రోజునే ఫిబ్రవరి 14న భద్రతా మండలి ప్రకటన చేయాలని భావించింది. కానీ తమకు సమయం కావాలంటూ చైనా అడ్డుపడింది. ప్రకటనలో ఉగ్రవాదం అనే పదం వాడటంపై తమకు అభ్యంతరం ఉందంటూ అడ్డుపడింది. దీంతో 15కి వాయిదా వేశారు. మళ్లీ చైనా అదే పాట పాడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు గురువారం పుల్వామా దాడిని ఖండిస్తూ భద్రతా మండలి ప్రకటన చేసింది. ఇది భారత దౌత్య విజయంగా చెప్పొచ్చు.

ఈ ప్రకనట వెలువడటానికి అగ్రరాజ్యం అమెరికా చాలా సహకరించిందని భారత వర్గాలు చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఎంతో కాలంగా భద్రతాబలగాలపై జరుగుతున్న దాడులకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఖండించడం ఇదే మొదటిసారి. భత్రతా మండలిలో మొత్తం 15 దేశాలున్నాయి. అందులో కొన్ని శాశ్వత సభ్యత్వం కలవి, మరొకొన్ని తాత్కాళిక సభ్యత్వం కలవి ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu