వారి ఇళ్లలో సోదాలు చేయండి.. దేశం బాగుపడుతుందిః అజిత్

IT Raids On Heroes: ఈ మధ్యకాలంలో సినీతారలు, నిర్మాతలే టార్గెట్‌గా ఐటీ అధికారులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నాను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారించగా.. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, బిగిల్ నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ ఆకస్మికంగా దాడులు చేసింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఐటీ అధికారులు ఆయనను రహస్యంగా తీసుకెళ్లి […]

వారి ఇళ్లలో సోదాలు చేయండి.. దేశం బాగుపడుతుందిః అజిత్

IT Raids On Heroes: ఈ మధ్యకాలంలో సినీతారలు, నిర్మాతలే టార్గెట్‌గా ఐటీ అధికారులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నాను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారించగా.. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, బిగిల్ నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ ఆకస్మికంగా దాడులు చేసింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఐటీ అధికారులు ఆయనను రహస్యంగా తీసుకెళ్లి లెక్కల విషయంలో ప్రశ్నలు అడగడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.

నిబంధనల ప్రకారం కొద్దిరోజులు ముందుగా నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత విచారణ జరపాల్సి ఉంది. అయితే ఐటీ అధికారులు చెప్పాపెట్టకుండా విజయ్‌ను షూటింగ్ స్పాట్ నుంచి తీసుకెళ్లి ప్రశ్నించడం ఏంటని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు మండిపడ్డారు. ఇక ఈ విషయంపై తలా అజిత్ కుమార్ ఇటీవల స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘రేట్లను అమాంతం పెంచేసి.. పన్నులను భారీగా వేస్తూ.. ప్రజల డబ్బులను దోచుకుంటున్న రాజకీయ నాయకులను వదిలేసి.. సెలబ్రిటీలైన మమ్మల్ని ప్రశ్నించడం.. ఇళ్లను సోదాలు చేయడం ఏంటని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తే దేశంలో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోతాయని అజిత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలకు అందరి హీరోల ఫ్యాన్స్ మద్దతు తెలిపారు.

Published On - 7:25 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu