విశాఖవైపు మరో అడుగు.. జగన్ తాజా నిర్ణయం
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మెట్రోరైలు ప్రాజక్టు పరిధి పెంచాలన్న కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తీసుకున్నారు. గతంలో సిద్దమైన మెట్రో రైలు డీపీఆర్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీఆర్ రెడీ అయిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ […]
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మెట్రోరైలు ప్రాజక్టు పరిధి పెంచాలన్న కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తీసుకున్నారు. గతంలో సిద్దమైన మెట్రో రైలు డీపీఆర్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీఆర్ రెడీ అయిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. తాజాగా మరోసారి డీపీఆర్ రూపొందించేందుకు ప్రతిపాదనలను పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చారు.
గతంలో సుమారు 38 కి.మీల మేరకు మాత్రమే విశాఖలో మెట్రో నిర్మించాలని అప్పటి ప్రభుత్వం తలపెట్టగా జగన్ ప్రభుత్వం దాన్ని 80 కి.మీ.లకు పెంచాలని తలపెట్టింది. దానికి తోడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్షియంకు బాధ్యతలప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేశారు. కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ లాంటి సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం భావిస్తుంది. విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టును హైదరాబాద్ తరహాలోనే మూడు కారిడార్లుగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలుతోపాటు.. 60 కి.మీ. మేరకు మోడ్రన్ ట్రామ్ కారిడార్‌ను కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.