AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Free Mango: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. మార్కెట్‌లో షుగర్ ఫ్రీ మ్యాంగో.. మొక్క ధర తెలిస్తే షాక్..

షుగర్ పేషేంట్స్ మామిడి పండ్లను తినడంలో ఆంక్షలున్నాయి. అలాంటి మామిడి పండ్ల ప్రియులకు గుడ్ న్యూస్.. అవును ఇక నుంచి డయాబెటిక్ పేషెంట్లు కూడా మామిడి పండ్లను తినవచ్చు. షుగర్ ఫ్రీ మామిడికాయలు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతినదు. మామిడి పండ్లు ఎన్ని తిన్నా ఆరోగ్యంగా ఉంటారు.

Sugar Free Mango: షుగర్ పేషేంట్స్‌కు గుడ్ న్యూస్.. మార్కెట్‌లో షుగర్ ఫ్రీ మ్యాంగో.. మొక్క ధర తెలిస్తే షాక్..
Sugar Free Mango
Surya Kala
|

Updated on: Jun 07, 2023 | 10:13 AM

Share

పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి వస్తే చాలు.. చిన్న పెద్దా అందరూ ఇష్టంగా మండిపండ్ల రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మామిడి పండ్లను తినాలని ఉన్నా కొందరి ఆరోగ్యం నో అంటుంది. ముఖ్యంగా షుగర్ పేషేంట్స్ మామిడి పండ్లను తినడంలో ఆంక్షలున్నాయి. అలాంటి మామిడి పండ్ల ప్రియులకు గుడ్ న్యూస్.. అవును ఇక నుంచి డయాబెటిక్ పేషెంట్లు కూడా మామిడి పండ్లను తినవచ్చు. షుగర్ ఫ్రీ మామిడికాయలు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతినదు. మామిడి పండ్లు ఎన్ని తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. దేశంలో చాలా మంది రైతులు చక్కెర లేని మామిడిని పండిస్తున్నారు, అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్‌పూర్‌లో పండే మామిడి పండ్లు మిగతావి అన్నిటికంటే భిన్నంగా ఉన్నాయి. ఒక రైతు చక్కెర లేని కొత్త రకం మామిడిని అభివృద్ధి చేశాడు. వీటిని  మధుమేహ రోగులు కూడా తినవచ్చు.

న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం.. చక్కెర లేని మామిడిని పండిస్తున్న రైతు పేరు రామ్ కిషోర్ సింగ్.  ముజఫర్‌పూర్‌లోని ముషారీ బ్లాక్‌లోని బిందా గ్రామ నివాసి. గత కొన్నేళ్లుగా భిన్నమైన మామిడిపండ్ల ఉత్పత్తి గురించి పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక రకాల మామిడి పండ్లను అభివృద్ధి చేశారు. రామ్ కిషోర్ ఉత్పత్తి చేసిన మామిడి పండ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వాటిల్లో ఈ షుగర్ ఫ్రీ మామిడి కూడా ఒకటి. రామ్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. తన తోటలో పండే మాల్దా మామిడి పండు షుగర్ ఫ్రీ అని .. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినవచ్చు. దీని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి హాని ఉండదని చెప్పారు.

షుగర్ ఫ్రీ మామిడి మొక్క ఖరీదు రూ.4000

ఇవి కూడా చదవండి

సాధారణ మామిడి కంటే.. తన తోటలో పెరిగిన మాల్డా మామిడిలో TSS 12-13 మాత్రమే ఉందని చెప్పారు. కనుక మధుమేహ రోజులు కూడా ఈ షుగర్ ప్రీ మామిడి కాయను తినవచ్చని చెప్పారు. తన తోటలో పండిన  మామిడి పండ్లు షుగర్ పేషెంట్లకు ఏమాత్రం హానికరం కాదని పేర్కొన్నారు. విశేషమేమిటంటే రామ్ కిషోర్ సింగ్ తన తోటలోని మామిడి పండ్లను ల్యాబ్‌లో పరీక్షించారు. రైతు సోదరులు షుగర్ ఫ్రీ మామిడి పండించాలనుకుంటే తమ నర్సరీలో మామిడి మొక్కలు కొనుక్కోవచ్చని అంటున్నారు. షుగర్ ఫ్రీ మామిడి మొక్క ఒకటి ధర 4000 రూపాయలు.

రామ్ కిషోర్ సింగ్‌కు ఉద్యాన పంటల సాగులో నైపుణ్యం ఉంది. వ్యవసాయం, ఉద్యానవనాలపై ఆయనకున్న ఆసక్తితో పలువురు అవార్డులు అందుకున్నారు. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లోని ASM ఫౌండేషన్‌ ఆయనను ఉద్యానరత్న అనే బిరుదుతో సత్కరించింది. ఇది కాకుండా, అతను వ్యవసాయ రంగంలో మరెన్నో బహుమతులు, క్విజ్ పోటీలను గెలుచుకున్నాడు. విశేషమేమిటంటే, షుగర్ ఫ్రీ మామిడిని వివిధ రకాలను అభివృద్ధి చేయడంలో అతను దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us