పాక్ శరణార్ధులకు బంపరాఫర్

పది సంవత్సరాలకు పైగా నివాసం ఉంటోన్న 34మంది పాక్ శరణార్థులకు రాజస్థాన్ ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్ అధికారికంగా ధ్రువీకరించారు. పది సంవత్సరాలకు పైగా వారు దేశంలోనే నివసిస్తున్నారని.. వారిలో 19 మంది బర్మార్, 10 మంది పలి, ఐదుగురు జలోర్ జిల్లాల నుంచి వచ్చారని ఆయన వివరించారు. ఇక ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 79 మంది పాక్ శరణార్థులకు […]

పాక్ శరణార్ధులకు బంపరాఫర్
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 2:57 PM

పది సంవత్సరాలకు పైగా నివాసం ఉంటోన్న 34మంది పాక్ శరణార్థులకు రాజస్థాన్ ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్ అధికారికంగా ధ్రువీకరించారు. పది సంవత్సరాలకు పైగా వారు దేశంలోనే నివసిస్తున్నారని.. వారిలో 19 మంది బర్మార్, 10 మంది పలి, ఐదుగురు జలోర్ జిల్లాల నుంచి వచ్చారని ఆయన వివరించారు. ఇక ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 79 మంది పాక్ శరణార్థులకు భారత పౌరసత్వం లభించిందని ఆయన చెప్పుకొచ్చారు.