అవినీతికి పాతరేస్తాం : మంత్రి వెల్లంపల్లి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వీఐపీ క్యూలైన్‌లో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాలపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని అన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై సమీక్షిస్తామని, భక్తుల కానుకలతో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సూచించారు. టీటీడీలో […]

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వీఐపీ క్యూలైన్‌లో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాలపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని అన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై సమీక్షిస్తామని, భక్తుల కానుకలతో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సూచించారు. టీటీడీలో తలెత్తిన అన్ని వివాదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే.. రమణదీక్షితులు, వంశపారంపర్య అర్చకుల ఇబ్బందులను పరిశీలిస్తామని చెప్పారు. కాగా.. పురాతన నాణేలతో తయారు చేసిన మెమెంటో వివాదాలపై విచారణ జరపి, బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.