Maharashtra Floods: మహారాష్ట్ర వరదల్లో 251 మందికి పైగా మృతి.. 100 మంది గల్లంతు.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్
మహారాష్ట్రలో సంభవించిన వరదల్లో 251 మంది మరణించారని, సుమారు 100 మంది గల్లంతయ్యారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. దాదాపు 13 జిల్లాల్లో ఎక్కువ మంది మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్...
మహారాష్ట్రలో సంభవించిన వరదల్లో 251 మంది మరణించారని, సుమారు 100 మంది గల్లంతయ్యారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. దాదాపు 13 జిల్లాల్లో ఎక్కువ మంది మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వరద ప్రాంతాలని విజిట్ చేసి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆనేక చోట్ల ఇళ్ళు, పంటలు దెబ్బ తిన్నాయన్నారు. బాధితులకు సాయం విషయంలో కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అలాగే తమ పార్టీ తరఫున కూడా సహాయం చేయాలన్న యోచన ఉందన్నారు. ఇంతటి ప్రకృతి విపత్తు ఇటీవలి కాలంలో ఎన్నడూ సంభవించలేదన్నారు.
కేంద్రం మహారాష్ట్రకు అన్ని విధాలా సహాయం చేస్తున్నప్పటికీ కొందరు బీజేపీ నేతలు మాత్రం చేస్తున్న వ్యాఖ్యలు సందర్భోచితంగా లేవని నవాబ్ మాలిక్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని నారాయణ్ రాణే వంటి వారు మాట్లాడుతున్నారని , కానీ ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని ఆయన చెప్పారు. ఓ వైపు ప్రజలు ఈ బీభత్సానికి నానా పాట్లు పడుతూ భారీగా ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవిస్తుంటే వీరు ఈ విధమైన యోచనలో ఉన్నారని ఆయన విమర్శించారు. విపక్షాలు ఈ తరుణంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. కాగా రత్నగిరి, సతారా, థానే, పూణే వంటి అనేక జిల్లాల్లో సహాయక బృందాలు నిర్వాసితులను రక్షించేందుకు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నాయి. 142 మరబోట్లను వినియోగిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : చిరంజీవి, ఎన్టీఆర్ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.
ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్:Samsung The Wall Video
మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.