Dussehra: మీ ఫొటోలతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. విషెస్ కోసం ఈ టెక్నిక్ పాటించండి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తండి..

దసరా పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవ రాత్రులు అక్టోబర్ 4న ముగిసి, పదో రోజున వియయదశమి పండుగను జరుపుకుంటారు...

Dussehra: మీ ఫొటోలతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. విషెస్ కోసం ఈ టెక్నిక్ పాటించండి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తండి..
Whatsapp
Follow us

|

Updated on: Oct 03, 2022 | 12:29 PM

దసరా పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవ రాత్రులు అక్టోబర్ 4న ముగిసి, పదో రోజున వియయదశమి పండుగను జరుపుకుంటారు. అయితే పండుగ సందర్భంగా విషెస్ చెప్పుకోవడం కామన్. అప్పట్లో ఫోన్ లు చేయడం, లేదా వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి విషెస్ చెప్పే విధానం మారిపోయింది. వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్.. ఇలా ఎన్నో యాప్ ల ద్వారా పలకరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తన యూజర్ల కోసం మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫొటోలు, వీడియోలు, ఎమోజీలు, స్టిక్కర్‌లను ఉపయోగించి విష్ చేసేలా మార్పులు చేసింది. సాధారణంగా స్టిక్కర్లు, జిఫ్ లను ఉపయోగించి రంగురంగుల్లో ఆకర్షణీయంగా పండుగ శుభాకాంక్షలను పంపవచ్చు. దీని కోసం యూజర్లు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ద్వారా థర్డ్-పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

నవరాత్రి స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేయాలి..

-గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ను ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్‌లో నవరాత్రి వాట్సాప్ స్టిక్కర్ల యాప్ అని టైప్ చేయండి. మీకు చాలా రకాలైన యాప్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఉపయోగించాలనుకుంటున్న స్టిక్కర్ యాప్‌ని ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, వాట్సాప్ ఓపెన్ చేయాలి. చాట్ విండోను తెరిచి, కీ బోర్డ్‌లోని ఎమోజీ విభాగానికి వెళ్లండి. వాట్సాప్ లో శుభాకాంక్షలు పంపడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న స్టిక్కర్ ప్యాక్ కోసం వెతకండి. పంపాలనుకుంటున్న స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకుని చక్కగా పంపించేయొచ్చు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్ స్టిక్కర్లను ఎలా తయారు చేయాలి..

వాట్సాప్ లో పర్సనల్ స్టిక్కర్లను తయారు చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ యాప్ తెరిచి బ్యాక్‌ గ్రౌండ్ రిమూవర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్ చేసి, గ్యాలరీ నుంచి మీరు స్ట్రైకర్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోలను సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటో బ్యాక్ గ్రౌండ్ తీసేయాలి. తర్వాత ఫొటోను పీఎన్జీ ఫార్మేట్ లో సేవ్ చేయండి. వీటిని గ్యాలరీలో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌లో వీటిని స్టిక్కర్‌లుగా పంపించడానికి మరొక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. Personal Stickers for WhatsApp పేరుతో ఒక యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి, ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసిన అన్ని స్టిక్కర్‌లను సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతే ఏం చక్కా వాట్సాప్ చాటింగ్ద్వారా వీటిని పొంది అందరికీ పంపించుకోవచ్చు.