AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Washing Tips: దసరాకు ముందే మీ కార్ వాషింగ్ ఇలా చేయండి.. రంగు పోకుండా ఉంటుంది..

మీరు ఎంతో ప్రేమించే మీ కారుకు దుమ్ము పట్టిందని కడుగుతున్నారా..? బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి అదే పనిగా కడుగుతున్నారా..? అయితే అలా చేయకండి.. చాలా సింపుల్‌గా కారును వాష్ చేసేందుకు ఇలాంటి చిట్కాలను పాటించండి..

Car Washing Tips: దసరాకు ముందే మీ కార్ వాషింగ్ ఇలా చేయండి.. రంగు పోకుండా ఉంటుంది..
Car Washing
Sanjay Kasula
|

Updated on: Oct 03, 2022 | 1:44 PM

Share

“రిలేషన్ షిప్స్ కి టైం ఇవ్వకపోయినా అవి తుప్పు పట్టిపోతాయని” అంటారు. ఇది దాదాపు ప్రతి విషయంలోనూ వర్తిస్తుంది. మనిషి అయినా.. యంత్రమైనా.. వాహనం ఉంటే దాన్ని ఉపయోగించడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వినియోగానికి అనుగుణంగా.. వాహనంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. తద్వారా మీరు దాని నుంచి మంచి అవుట్‌పుట్ పొందవచ్చు. దీంతో మీ వాహనం చాలా కాలం పాటు కొత్తదిగా కనిపిస్తుంది. దీని కోసం మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అయితే దసర వచ్చిందంటే మన టూ వీలర్, ఫోర్ వీలర్‌తోపాటు అన్ని రకాల వాహనాలను వాషింగ్ చేస్తుంటాం. అందులోనూ కారుపై మరింత శ్రద్ధ పెడుతుంటాం. ఎందుకంటే అందులో మనతోపాటు మన కుటుంబం కూడా ప్రయాణిస్తుంది. అయితే వాషింగ్ చేయిస్తున్నప్పు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మంచి వాషింగ్ సెంటర్‌ను ఎంచుకోవాలి.. ఎలా చేస్తుండో చూడాలి.. ఇలాంటి మరిన్ని విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఎండలో పార్క్ చేయవద్దు

మన భారత దేశంలో ఏడాది పొడవునా సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా ఎండలో ఏ వస్తువు పెట్టినా దాని రంగు కోల్పోతుంది. కారు కూడా అంతే.. నిరంతరం ఎండ వేడి తగిలే ప్రాంతంలో కారును పార్క్ చేయకపోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రంగు పోవడమే కాదు చూడటానికి బాగుండదు. అందువల్ల, ఎండలో ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవడం చాలా అవసంరం. 

కారు కవర్ ఉపయోగం..

కార్ వాషింగ్ ఎలా చేయాలి..

బయటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారీ కారును వాష్ చేసే అలవాటు ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలా చేస్తున్నప్పుడు రకరకాల వస్తువులు వాడుతుంటాం. అలా ప్రతి సారి కడగాల్సిన అవసంర లేదు. మరీ ఎక్కువగా మురికిగా ఉన్నప్పుడు మాత్రమే కారును కడగాలి. కారును కడగేటప్పుడు బ్రష్‌లు, మన ఇంట్లో ఉపయోగించే బట్టల వాషింగ్ పౌడర్‌ వంటి వాటిని అస్సలు ఉపయోగించవద్దు. అంతే కాదు కడిగిన తర్వాత హార్డ్ క్లాత్‌తో అస్సలు తుడవద్దు. ఇందుకు బదులుగా, మృదువైన వస్త్రాలు, షాంపూ లేదా కార్ వాష్ ఫోమ్‌లు లేదా ద్రవాలను మాత్రమే ఉపయోగించండి.

షైనింగ్ క్రీమ్ ఉపయోగించడం..

కారును కడిగిన తర్వాత, మీరు కావాలంటే షైనింగ్ క్రీమ్స్ వంటివి ఉపయోగించవచ్చు. ఇది కారు బాడీపై పొరను సృష్టించి మృదుత్వాన్ని తెస్తుంది. దీని కారణంగా దుమ్ము కారణంగా మీ కారు ఉపరితలంపై తక్కువ నష్టం జరుగుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

Follow Us