ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ ఎన్నిరోజులకోసారి.. ఎలా కడగాలో తెలుసా..? ఇలా చేస్తే ఈజీ..!
ఈ లిక్విడ్ తో ట్యాంక్ గోడలను గట్టిగా రుద్దుకుని, ఆ తర్వాత మంచినీటితో కడిగేయాలి. తరువాత, ట్యాంక్‌లో తిరిగి నీటిని నిల్వ చేసుకోవచ్చు. అయితే, అందరూ ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేయటానికి వీలుండదు. ఈ సందర్భంలో, మీరు బయట ఉండి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు..
ప్రతి ఇంటి పైకప్పు మీద వాటర్ ట్యాంక్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే, చివరిసారిగా మీరు మీ వాటర్ ట్యాంక్‌ని ఎప్పుడు శుభ్రం చేశారో గుర్తుందా? గుర్తులేకపోతే ఒకసారి వెళ్లి ట్యాంక్ మూత తీసి నీళ్లలో చూడండి. దాని దిగువన పేరుకుపోయిన చెత్తను చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ప్రతిరోజూ ఇంత మురికి నీటిని ఉపయోగిస్తున్నామని. కానీ, ఆ వాటర్ ట్యాంక్ శుభ్రం చేయటం అందరికీ పెద్ద టాస్క్ వంటిదేనని చెప్పాలి. చాలా మంది వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్లంబర్ల సహాయం తీసుకుంటుంటారు. అందుకోసం తరచూ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా మీ ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌ని మీరే శుభ్రం చేసుకోవచ్చు.
చాలా కాలం పాటు ట్యాంక్‌ను శుభ్రం చేయకపోతే దుర్వాసన కూడా వస్తుంది. అందువల్లే వాటర్ ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం అత్యవసరం. వాటర్ ట్యాంక్‌ని ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ట్యాంక్ పైన మూతలేని ట్యాంక్‌ను ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాంక్ శుభ్రం చేయాలి. లేదంటే మురికి నీళ్ల వల్ల కుళాయి జామ్ అవడంతో పాటు ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలనుకుంటే ముందుగా అందులోని సగం నీటిని తీసి మరో డబ్బాలో నిల్వ చేసుకోవాలి. లేదంటే ట్యాంక్ పూర్తి ఖాళీ అయిన తర్వాత వాటర్ ట్యాంక్ క్లినింగ్ పని పెట్టుకోవచ్చు. ఇందుకోసం నీటిలో డిటర్జెంట్ పౌడర్‌తో ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ లిక్విడ్ తో ట్యాంక్ గోడలను గట్టిగా రుద్దుకుని, ఆ తర్వాత మంచినీటితో కడిగేయాలి. తరువాత, ట్యాంక్‌లో తిరిగి నీటిని నిల్వ చేసుకోవచ్చు. అయితే, అందరూ ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేయటానికి వీలుండదు. ఈ సందర్భంలో, మీరు బయట ఉండి శుభ్రం చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు.
ఇందుకోసం వాటర్ ట్యాంక్ ఖాళీ చేయకుండా.. దానికి 400-500 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి, అరగంట వరకు వదిలివేయండి. ఈ సమయంలో నీటిని అస్సలు ఉపయోగించవద్దు. ఇప్పుడు ఇంట్లోని అన్ని కుళాయిలు తెరిచి ట్యాంక్ నుండి నీటిని ఖాళీ చేయండి. ఇలా చేయడం వల్ల కుళాయిలో పేరుకుపోయిన చెత్త మొత్తం శుభ్రం అవుతుంది. దిగువన మిగిలిన నీటిని శుభ్రం చేయడానికి, పొడవైన కర్రకు ఒక గుడ్డను కట్టి గట్టిగా తుడుచుకోవాలి. 10-12 గంటల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో నింపుకోవచ్చు. కాకపోతే, ఇక్కడ ఎక్కువ సమయం, ఎక్కువ నీరు వృధా అవుతుందని గుర్తుంచుకోండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..