Rare Monkey: అరుదైన కోతి జననం.. సంతోషంలో అధికారులు.. బ్రిటన్‌ జూలో మకాక్‌ జాతి కోతి పిల్ల జననం.

Rare Monkey: అరుదైన కోతి జననం.. సంతోషంలో అధికారులు.. బ్రిటన్‌ జూలో మకాక్‌ జాతి కోతి పిల్ల జననం.

Anil kumar poka

|

Updated on: Jun 08, 2023 | 9:26 PM

బ్రిటన్‌లోని ఓ జూలో అరుదైన జాతికి చెందిన కోతిపిల్ల జన్మించింది. దాంతో ఆ దేశ అధికారులు సంతోషం పట్టలేకుండా ఉన్నారు. ఇదేంటి కోతి పిల్ల పుడితేనే అంతగా ఆనందపడిపోవాలా అనుకుంటున్నారా... అది మామూలు కోతి పిల్ల కాదు మరి. ఎంతో అరుదైన మకాక్‌ జాతికి చెందినది.

బ్రిటన్‌లోని ఓ జూలో అరుదైన జాతికి చెందిన కోతిపిల్ల జన్మించింది. దాంతో ఆ దేశ అధికారులు సంతోషం పట్టలేకుండా ఉన్నారు. ఇదేంటి కోతి పిల్ల పుడితేనే అంతగా ఆనందపడిపోవాలా అనుకుంటున్నారా… అది మామూలు కోతి పిల్ల కాదు మరి. ఎంతో అరుదైన మకాక్‌ జాతికి చెందినది. అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్న కోతి. ఇది ఇండోనేషియాలోని సులవేసి ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ జాతి కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌లోని చెస్టర్‌ జూలో మకాక్‌ జాతికి చెందిన కోతుల జంటకు ఒక పిల్ల కోతి జన్మించింది. దీంతో అక్కడి సిబ్బంది, అధికారులు ఇది చాలా సంతోషించదగ్గ పరిణామంగా వెల్లడించారు. తమ జూలో మకాక్‌ జాతి కోతిపిల్ల జన్మించడం మకాక్‌ జాతి కోతుల సంరక్షణ కోసం చేపట్టిన గ్లోబల్‌ బ్రీడింగ్‌ కార్యక్రమానికి శుభపరిణామమని చెస్టర్‌ జూ క్షీరదాల విభాగం అధ్యక్షుడు మార్క్‌ బ్రే షా అన్నారు. ఇండోనేసియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్‌ జాతి కోతుల ఉనికి ఎక్కువగా ఉంటుంది. అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కంటే దిగువకు పడిపోయింది. దాంతో ఈ మకాక్‌ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.