ఏపీలో అన్నదాతకు జగన్ సర్కార్ శుభవార్త.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు..

ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థను విపరీతంగా ప్రోత్సహించారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాలశాఖకు భారీగా అప్పులు చేశారని విమర్శించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .

ఏపీలో అన్నదాతకు జగన్ సర్కార్ శుభవార్త.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు..
YS Jagan
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 09, 2023 | 7:39 AM

ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గొప్ప శుభవార్తనందించింది. రైతులకూ ఊరటనిస్తూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. దళారీ వ్యవస్థకు బ్రేకులు వేస్తూ రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేపట్టింది. దళారీ వ్యవస్థకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము జమ చేయనుంది. పౌరసరఫరాల శాఖలో ఇలాంటి అనే మార్పులు తీసుకొచ్చిందని ఆ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని.. రబీ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమన్నారు. ఇందులో రూ.28,402 కోట్లు విలువైన 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. పౌరసరఫరాల శాఖలో జగన్‌ సర్కార్‌ అనే మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతుల నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.28,200 కోట్లను రైతులకు చెల్లించామని.. మిగిలిన సొమ్మును త్వరలోనే జమ చేస్తామని చెప్పారు మంత్రి కారుమూరి.

ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థను విపరీతంగా ప్రోత్సహించారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాలశాఖకు భారీగా అప్పులు చేశారని విమర్శించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .

ఇవి కూడా చదవండి