AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నాళ్లో వేచిన హృదయం.. విదేశాల్లో ఉంటున్న కొడుకు.. సడెన్‌గా ఇంటికొస్తే.. ఏమైందో మీరే చూడండి..

అతడు ఇంటికి రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. వారంతా అతన్ని కౌగిలించుకొని ఆనందంగా పలకరిస్తుంటారు. ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లి అమ్మ ముందు నిలబడతాడు. ఊహించని విధంగా ఎక్కడో దూరంగా ఉంటున్న కొడుకును ఒక్కసారిగా కళ్లముందు చూసే సరికి ఆ తల్లి ఆశ్చర్య పోతుంది.

ఎన్నాళ్లో వేచిన హృదయం.. విదేశాల్లో ఉంటున్న కొడుకు.. సడెన్‌గా ఇంటికొస్తే.. ఏమైందో మీరే చూడండి..
Mother Son
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2023 | 1:49 PM

చాలామంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండి కష్టపడుతుంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే తపనతో ఎంత కష్టమైనా కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. అలా ఎన్నో కోరికలు, కలలు కంటూ వాటిని తీర్చుకునేందుకు ఎదురు చూస్తుంటారు. అలా వెళ్లిన పిల్లల కోసం ఆ తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమతో ఎదురు చూస్తుంటారు. ఇక ఆ కొడుకు విదేశాల నుంచి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఆ తల్లి ఆనందానికి అవధులుండవు. ముఖ్యంగా తల్లీ కొడుకులు కలిసే అపురూప క్షణాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. అలాంటి తల్లీకొడుకులు చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓ కొడుకు తన తల్లిని కలిసిన సందర్భంగా హృదయాన్ని హత్తుకునేలా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తల్లీకొడుకుల బంధం గురించిన ఈ ఎమోషనల్ వీడియోను అంజిల్ (@anzil_a) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో విదేశాల్లో ఉన్న ఓ కొడుకు తన తల్లికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు కుటుంబసభ్యులకు చెప్పకుండా స్వదేశానికి వచ్చాడు. అతడు ఇంటికి రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. వారంతా అతన్ని కౌగిలించుకొని ఆనందంగా పలకరిస్తుంటారు. ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లి అమ్మ ముందు నిలబడతాడు. ఊహించని విధంగా ఎక్కడో దూరంగా ఉంటున్న కొడుకును ఒక్కసారిగా కళ్లముందు చూసే సరికి ఆ తల్లి ఆశ్చర్య పోతుంది. ఆనందంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలాంటి మధురమైన ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినిగియోదారుల మనసు గెలుచుకుంటోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anzil (@anzil_a)

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియోకు 14.3 మిలియన్లకు పైగా వ్యూస్‌, 2.7 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకి దాదాపు 34.6 K వ్యాఖ్యలు కూడా వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ..