క్రికెట్‌ లో వాగ్వాదం.. ఇద్దరు మైనర్ల మధ్య గొడవ.. బ్యాట్‌తో కొట్టడంతో 13 ఏళ్ల బాలుడు మృతి..

ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి పోలీసు ఫిర్యాదు, కేసు చేయకుండానే మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారని నగర పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. అతని తల్లి ఫిర్యాదు మేరకు జూన్ 7న కేసు దర్యాప్తు కోసం మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు.

క్రికెట్‌ లో వాగ్వాదం.. ఇద్దరు మైనర్ల మధ్య గొడవ.. బ్యాట్‌తో కొట్టడంతో 13 ఏళ్ల బాలుడు మృతి..
Crime News
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2023 | 12:23 PM

పిల్లల క్రికెట్‌ ఆటలో చెలరేగిన వివాదం ఒకరి ప్రాణం తీసే దాకా వెళ్లింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో క్రికెట్ ఆడే విషయంలో పిల్లల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్న గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల మరో మైనర్ బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బాధితుడి తలపై బ్యాట్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు రెండు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పారాడాడు. జూన్ 3న జరిగిన ఈ ఘటనలో గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి పోలీసు ఫిర్యాదు, కేసు చేయకుండానే మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారని నగర పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. అతని తల్లి ఫిర్యాదు మేరకు జూన్ 7న కేసు దర్యాప్తు కోసం మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు.

చంద్రపూర్ జిల్లాలోని బగద్కిడ్కి ప్రాంతానికి చెందిన కొందరు కుర్రాళ్లు జూన్‌ 3న ఓ మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఆట ఆడుతున్న సమయంలో బాధితుడు ఇతర అబ్బాయిలతో వాగ్వాదానికి దిగాడని, నిందితులు అతనిని బ్యాట్‌తో కొట్టారని అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే బాధిత బాలుడు నేలపై పడిపోయాడు. వెంటనే జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందినట్లు తెలిపారు. అతని బంధువులు పోలీసు కంప్లైంట్ నమోదు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, అతని తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, బాలుడు పరారీలో ఉన్నట్టుగా అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు