AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prawns Benefits : పచ్చి రొయ్యలు తింటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రాణాంతక వ్యాధులు పరార్‌..!

సీ ఫుడ్స్ లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి3 సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంలో రొయ్య‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే సెలీనియం అనే పదార్థం..

Prawns Benefits : పచ్చి రొయ్యలు తింటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రాణాంతక వ్యాధులు పరార్‌..!
Prawns
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2023 | 9:20 AM

Share

సీ ఫుడ్స్ లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చేస్తుంది. ఇందులో ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి3 సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంలో రొయ్య‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే సెలీనియం అనే పదార్థం క్యాన్సర్ వంటి భ‌యంకర స‌మ‌స్య‌ల‌ నుండి ర‌క్షిస్తుంది. ఇంకా రొయ్యలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో పరిశీలిచినట్టయితే..

బరువు తగ్గడంలో రొయ్యలు..

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా త‌మ డైట్‌లో రొయ్య‌ల‌ను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్య‌లు సులువుగా జీర్ణమ‌వ‌డంతో పాటు. శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్య‌ల‌తో ల‌భిస్తాయి. అందుకే వారానికి ఒక‌సారైన రొయ్య‌ల్ని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ నియంత్రణ..

ఈ చేపలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం.

ఎముకలు, కండరాలకు..

అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు, కండరాలు బలపడతాయి. అలాగే రొయ్య‌లు తిన‌డం వ‌ల్ల మ‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే..ఇందులో ఉండే జింక్, సెలీనియం శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే రొయ్య‌ల‌ను త‌ర‌చూ తీసుకుంటే మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చర్మకాంతికి..

చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం…