AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious village: ఇది అంధుల గ్రామం.. మనుషులే కాదు, పశువులు, పక్షులు కూడా చూపుకోల్పోతాయి..

ఇక్కడ నివసించే మనుషులు, జంతువులు అన్నీ అంధులే. వారికి ఏమీ కనిపించదు. ఇక్కడ ఒక బిడ్డ పుట్టినప్పుడు, అతని కళ్ళు బాగానే ఉంటాయి, కానీ క్రమంగా అతను కూడా అంధుడిగా మారతాడు. ఈ గ్రామంలో నివసించే కొందరు ప్రజలు మాత్రం తమ అంధత్వానికి శాపగ్రస్తమైన వృక్షమే కారణమని నమ్ముతారు.

Mysterious village: ఇది అంధుల గ్రామం.. మనుషులే కాదు, పశువులు, పక్షులు కూడా చూపుకోల్పోతాయి..
Blind Village
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2023 | 7:20 AM

Share

ఈ ప్రపంచంలో అనేక అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. నిగూఢమైన ఈ ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా సమాధానం దొరకని ఇలాంటి వింత విషయాల గురించి గతంలో అనేకం వినే ఉంటారు. నమ్మడం కష్టంగా మారే అనేక ఇతర విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి ఈ ప్రపంచంలో ఒక వింత గ్రామం ఉంది. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అంధుడు అవుతాడు. ఈ ఊరిలో పుట్టిన మనుషులే కాదు జంతువులకు కూడా కంటి చూపు ఉండదు. ఇది వినడానికి షాకింగ్‌ విషయమే అయినప్పటికీ ఇది పరమ సత్యం. ఈ గ్రామంలో పుట్టిన ప్రతి చిన్నారి ఆ తర్వాత చూపు కోల్పోతుంది. ఈ అంశం నిజంగానే చాలా ఆశ్చర్యకరమైనది. అటువంటి మర్మమైన గ్రామం ఎక్కడుంది.. దాని వెనుక అసలు రహస్యం ఏంటీ..? ఇది ప్రపంచంలోని ఒక రహస్యమైన గ్రామం. ఇక్కడ ప్రతి జీవి కళ్లతో చూడలేని అంధులు.. అందువల్ల దీనిని అంధుల గ్రామం అని కూడా అంటారు. ఈ వింత కారణంగా ఈ గ్రామం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా దీని వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

ఈ గ్రామం పేరు టిల్తెపాక్. ఇది మెక్సికోలో ఉంది. ఇక్కడ నివసించే మనుషులు, జంతువులు అన్నీ అంధులే. వారికి ఏమీ కనిపించదు. ఇక్కడ ఒక బిడ్డ పుట్టినప్పుడు, అతని కళ్ళు బాగానే ఉంటాయి, కానీ క్రమంగా అతను కూడా అంధుడిగా మారతాడు. ఈ గ్రామంలో నివసించే గిరిజనులు తమ అంధత్వానికి శాపగ్రస్తమైన వృక్షమే కారణమని నమ్ముతారు. లావాజులా అనే చెట్టు ఉందని, దానిని చూసిన తర్వాత మానవుల నుండి జంతువులు, పక్షుల వరకు అందరూ అంధులవుతున్నారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. కొన్నేళ్లుగా ఈ చెట్టు ఈ గ్రామంలో ఉంది. ఈ చెట్టును చూసిన వారు అంధులవుతారని ఇక్కడి ప్రజలు చెబుతున్నమాట.

ఇదిలా ఉంటే, ఈ గ్రామం ఉన్న చోట విషపు ఈగలు కనిపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఈగలు కుట్టడం వల్ల ఆ వ్యక్తి అంధుడు అవుతాడు. దీని గురించి సమాచారం అందుకున్న మెక్సికో ప్రభుత్వం గ్రామస్థులకు సహాయం చేయడానికి ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం కూడా విజయం సాధించలేదు. దాంతో ఇక్కడి ప్రజలను పునరావాసం చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఈ తెగను మరో చోట సెటిల్ చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఇతర వాతావరణం వారి శరీరాలకు అనుకూలంగా లేదు. దాంతో ప్రభుత్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు ఆ ప్రజలు తమను తాము రక్షించుకుంటూ అక్కడే మిగిలిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం