Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న ఎయిర్‌ ఇండియా ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులు..

Magadan airport: రష్యాలోని మారుమూల ప్రాంతమైన మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న ఎయిర్‌ ఇండియా ప్రయాణికులను కాపాడడానికి ప్రత్యేక విమానాన్ని పంపించారు.

Air India: మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న ఎయిర్‌ ఇండియా ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులు..
Magadan Airport
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 07, 2023 | 8:48 PM

Magadan airport: రష్యాలోని మారుమూల ప్రాంతమైన మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న ఎయిర్‌ ఇండియా ప్రయాణికులను కాపాడడానికి ప్రత్యేక విమానాన్ని పంపించారు. ముంబై నుంచి ప్రత్యేక విమానం మగడాన్‌ బయలుదేరింది. మగడాన్‌లో నరకయాతన అనుభవిస్తున్నారు ప్రయాణికులు. తిండితిప్పలు లేక అలమటిస్తున్నారు. మగడాన్‌ ప్రాంతంలో హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ప్రయాణికుల్లో కొందర్ని డార్మిటరీల్లో ఉంచారు. అలాగే లగేజ్ మొత్తం విమానంలో ఉండిపోవడంతో వారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ప్రయాణికుల్లో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. అక్కడ భాష కూడా అడ్డంకిగా మారింది. కొంతమందిని పాఠశాలకు తరలించారు. ఆహారం విషయంలో ఇబ్బంది ఏర్పడింది. కొంతమంది బ్రెడ్, సూప్‌ తాగి సరిపెట్టుకుంటున్నారు. కొంతమందికి మెడిసిన్‌ కూడా అందుబాటులో లేదు.

మంగళవారం బయల్దేరిన విమానం

న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు మంగళవారం బయల్దేరిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. అయితే మగడాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో సరైన వసతులు లేకపోవడంతో ప్రయాణికులు కిందనే పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

రష్యా రాజధాని మాస్కోకు 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మగడాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్‌ కావడంతో సహాయక చర్యలకు కష్టమవుతోంది. మగడాన్‌లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ఆహారాన్ని కూడా ప్రత్యేక విమానంలో పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..